ETV Bharat / bharat

'మాజీ సీజేఐపై దాఖలైన ఆ పిటిషన్ చెల్లదు'

author img

By

Published : Aug 21, 2020, 1:32 PM IST

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి వ్యవహారశైలిపై దాఖలైన పిటిషన్​ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. జస్టిస్ గొగొయి తన కార్యాలయాన్ని కూడా ఖాళీ చేశారని, ఈ అభ్యర్థనను ఇకపై అంగీకరించలేమని కోర్టు స్పష్టం చేసింది.

SC dismisses plea seeking enquiry against Ranjan Gogoi
"మాజీ సీజేఐపై దాఖలైనా ఆ పిటిషన్ చెల్లదు!"

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి.. సీజేఐగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

2018లో దాఖలైన ఈ వ్యాజ్యాన్ని.. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. 'జస్టిస్ గొగొయి ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఆయన ఇప్పటికే తన కార్యాలయాన్ని కూడా ఖాళీ చేశారు. ఈ పిటిషన్ రెండేళ్లుగా మా దృష్టికి రాలేదు కాబట్టి, అప్పుడు దాఖలైన ఈ పిటిషన్ ఇప్పుడు చెల్లదని' ధర్మాసనం అభిప్రాయపడింది.

ప్రస్తుతం జస్టిస్‌ రంజన్‌ గొగొయి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య భూ వివాదంపై జస్టిస్‌ గొగొయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం చరిత్రాత్మక తీర్పునిచ్చింది.

ఇదీ చదవండి: 'సుప్రీం' మాజీ సీజేఐ రంజన్​ గొగొయికి రాజ్యసభ సభ్యత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.