కరోనా సంక్షోభ కాలంలో సుప్రీంకోర్టు 15 వేలకు పైగా కేసుల్లో విచారణ చేపట్టింది. మార్చి 23 నుంచి సుమారు 1,021 ధర్మాసనాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 50వేల మంది న్యాయవాదులు వాదనలు వినిపించారని తెలిపింది.
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మార్చి 23 నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని నిర్ణయించింది సుప్రీంకోర్టు. ఈ 100 రోజుల వ్యవధిలో సుమారు 4,300 కేసుల్లో తీర్పులను వెల్లడించింది.
ఇబ్బందులు ఎదురైనా..
ఈ క్రమంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీలోని 125 మంది సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడినట్లు తెలిపింది. ఇంతమందికి కరోనా సోకినా కార్యకలాపాలకు మాత్రం నిలిపేయలేదు న్యాయస్థానం. వీడియో కాన్ఫరెన్స్లో వాదనలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదుల కోసం 12 గదులను ఏర్పాటు చేసింది.
ఇతర దేశాల్లో ఇలా..
ఇదే సమయంలో బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానం 29 కేసుల్లో తీర్పును వెలువరించిందని తెలిపింది సుప్రీంకోర్టు. అమెరికా న్యాయస్థానం 74 కేసులను విచారించగా.. 44 కేసుల్లో తమ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇదీ చూడండి: 'మహా'లో కరోనా ఉగ్రరూపం-ఒక్కరోజే 13 వేల కేసులు