ETV Bharat / bharat

'ఆ చిన్నారులకు నెలకు రూ.2,000 అందించండి' - ఆన్​లైన్​ తరగతులు

పిల్లల సంరక్షణ కేంద్రాల(సీసీఐ) నుంచి కరోనా దృష్ట్యా ఇళ్లకు వెళ్లిన చిన్నారులకు నెలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆన్​లైన్​ తరగతులకు విద్యార్థులు హాజరవ్వడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపింది.

supreme court
ఆ చిన్నారులకు నెలకు రూ.2,000 అందించండి:సుప్రీం కోర్టు
author img

By

Published : Dec 15, 2020, 3:40 PM IST

పిల్లల సంరక్షణ కేంద్రాల(సీసీఐ) నుంచి ఇళ్లకు వెళ్లిన చిన్నారులకు విద్యాసాయం కింద నెలకు రూ.2,000 చొప్పున చెల్లించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. ఆన్​లైన్​ తరగతులకు హాజరయ్యేందుకు కావాల్సిన పరికరాలు, పుస్తకాలు, శానిటైజరీ ఉత్పత్తులు అందించాలని సూచించింది. కరోనా ప్రభావం వల్ల సంరక్షణ కేంద్రాల్లోని చిన్నారుల పరిస్థితిని న్యాయస్థానం సుమోటాగా తీసుకుంది. దీనిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన జస్టిస్​ ఎల్​. నాగేశ్వర్​ రావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు చెప్పింది.

కొవిడ్​ కంటే ముందు సీసీఐలలో 2,27,518 చిన్నారులు ఉండగా.. 1,45,788 మంది ఇళ్లలో పునరావాసం కోసం వెళ్లారని ధర్మాసనం పేర్కొంది. జల్లా చిన్నారుల సంరక్షణ విభాగం(డీసీపీయూ) సూచనల అనుసారం ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం 30 రోజుల్లోగా అందించాలని ఆదేశించింది. సీసీఐలలోని చిన్నారుల సౌకర్యాల పురోగతి గురించి జిల్లా న్యాయసేవల సంస్థకు డీసీపీయూలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని తెలిపింది.

సీసీఐలలోని చిన్నారులకు ఆన్​లైన్​ తరగతులకు కావాల్సిన సదుపాయాలను కల్పించాలని ఈ కేసులో అమికస్​ క్యూరీగా వ్యవహరించిన న్యాయవాది గౌరవ్​ అగర్వాల్​ వాదించారు. జాతీయ బాలల హక్కల పరిరక్షణ కమిషన్​(ఎన్​సీపీసీఆర్​) తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. అమికస్​ క్యూరీ సూచనలను స్వాగతించారు. చిన్నారుల సంరక్షణ గృహాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నట్లు తెలిపారు. అమికస్​ క్యూరీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఆన్​లైన్​ తరగతులకు హాజరయ్యేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని సొలిసిటర్​ జనరల్​ను ఆదేశించింది.

ఇదీ చూడండి:కర్ణాటక శాసనమండలిలో బాహాబాహీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.