ETV Bharat / bharat

"10రోజుల్లో వివరాలివ్వండి" - జస్టిస్​ రంజన్​ గొగొయి

లోక్​పాల్​పై సుప్రీం త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపిక కమిటీ సమావేశ తేదీల వివరాలు 10 రోజుల్లోగా తెలపాలని అటార్నీ జనరల్​ను ఆదేశించింది.

సుప్రీం కోర్టు
author img

By

Published : Mar 7, 2019, 1:39 PM IST

లోక్​పాల్​ ఎంపిక కమిటీ సమావేశ తేదీల వివరాలను 10 రోజుల్లోగా తెలియజేయాలని అటార్నీ జనరల్​ కె.కె.వేణుగోపాల్​నుసుప్రీంకోర్టుఆదేశించింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని జస్టిస్​ ఎస్​ఏ నజీర్​, జస్టిస్​ సంజీవ్​ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం లోక్​పాల్​పై విచారణ చేపట్టింది.

కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్​ కె.కె వేణుగోపాల్ ధర్మాసనం ముందు​ హాజరయ్యారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమార్తి రంజనా ప్రకాశ్​ దేశాయ్​ నేతృత్వంలోని సెర్చ్​ కమిటీ... ఎంపిక కమిటీకి మూడు ప్యానెల్​ల పేర్లను సూచించిందని వివరించారు ఏజే. ఈ ఎంపిక కమిటీ లోక్​పాల్​ ఛైర్​పర్సన్, జుడిషియల్​, నాన్​ జ్యుడిషియల్ సభ్యులను ఎంపిక చేస్తుందని వేణుగోపాల్​ తెలిపారు.

లోక్​పాల్​ ఎంపిక కమిటీ సమావేశ తేదీల వివరాలు 10 రోజుల్లోగా తెలపాలని అటార్నీ జనరల్​ను సుప్రీంకోర్టు ఆదేశించింది. వెంటనే స్పందించిన అటార్నీ జనరల్​... ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశాన్ని వీలైనంత త్వరగా ఏర్పాటుచేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణవ్యవహారాల శాఖ కార్యదర్శికి తాను విజ్ఞప్తి చేసినట్లు ​ తెలిపారు.

కాగా లోక్​పాల్​ వ్యవహారంపై ప్రశాంత్​ భూషణ్​ పిటిషన్​ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎంపిక కమిటీ ప్రతిపాదించిన 3 పానెళ్ల పేర్లు వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలన్న ఆయన పిటిషన్​ను తిరస్కరించింది.

Intro:Body:

a

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.