ETV Bharat / bharat

గ్యాంగ్​స్టర్ దుబే ఎన్​కౌంటర్​పై దర్యాప్తు షురూ!

గ్యాంగ్​స్టర్ వికాస్ దుబే ఎన్​కౌంటర్​లో నిజానిజాలు తేల్చేందుకు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్​కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. రెండు నెలల్లో విచారణ ముగించాలని స్పష్టం చేసింది. ఈ కమిషన్​కు ఐఎస్​ఏ లేదా ఇతర కేంద్ర ఏజెన్సీల సాయం అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

SC approves three-member commission to inquire Vikas Dubey encounter case
గ్యాంగ్​స్టర్ దుబే ఎన్​కౌంటర్​పై దర్యాప్తు షురూ!
author img

By

Published : Jul 22, 2020, 4:54 PM IST

ఉత్తర్​ప్రదేశ్ గ్యాంగ్​స్టర్ వికాస్ దుబే ఎన్​కౌంటర్ పూర్వాపరాల​పై... విచారణకు ముగ్గురు సభ్యుల కమిషన్​ను ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్​ ఛైర్మన్​గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎస్​ చౌహాన్​ను నియమిస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సుప్రీంకోర్టు తాజాగా ఆమోదం తెలిపింది.

రెండు నెలల్లో విచారణ పూర్తి!

యూపీ గ్యాంగ్​స్టర్ వికాస్ దుబే ముఠా జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి చెందారు. ఆ తరువాత తప్పించుకు పారిపోయిన వికాస్​ దుబే, అతని ఐదుగురు అనుచరులు వేర్వేరు ఎన్​కౌంటర్లో హతమయ్యారు. ​ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం... ముగ్గురు సభ్యుల విచారణ కమిషన్​ను ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్​ ఛైర్మన్​గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ చౌహాన్​ను, మరో ఇద్దరు సభ్యులుగా... హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శశికాంత్ అగర్వాల్​, రిటైర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ యూపీ కేఎల్​ గుప్తాను నియమించింది.

తాజాగా విచారణ కమిషన్​ ఏర్పాటు ముసాయిదాకు జస్టిస్ బోపన్న, జస్టిస్​ వి. రామసుబ్రహ్మణ్యంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం (సుప్రీంకోర్టు) ఆమోదం తెలిపింది. వారం రోజుల్లో కమిషన్ కార్యక్రమాలు ప్రారంభించి.. రెండు నెలల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని నిర్దేశించింది.

సహాయం అందించండి..

ఎన్​ఐఏ లేదా ఇతర కేంద్ర ఏజెన్సీల నుంచి... ఈ విచారణ కమిషన్​కు సహాయం అందించేలా కేంద్రం చూడాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యాక పూర్తి నివేదికను... సుప్రీంకోర్టుతో పాటు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించాలని నిర్దేశించింది.

ఇదీ చూడండి: రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.