ETV Bharat / bharat

పంట వ్యర్థాల దహన నివారణకు ఏకసభ్య కమిటీ - sc appoints ex-judge m b lokur as one-man panel to prevent stubble burning

పంట వ్యర్థాల దహనం నివారణకు చర్యలు చేపట్టేలా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్​తో కూడిన ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. 15 రోజులకోసారి లేదా కమిటీ నివేదిక అందించాలని సూచించింది. కమిటీ ఏర్పాటుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపిన అభ్యంతరాలను తోసిపుచ్చింది.

SC appoints monitoring committee to control stubble burning
పంట వ్యర్థాల దహన నివారణకు ఏకసభ్య కమిటీ
author img

By

Published : Oct 16, 2020, 3:12 PM IST

హరియాణా, పంజాబ్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం జరగకుండా నివారణ చర్యలు తీసుకునేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్​తో కూడిన ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కావాల్సిన సహకారం అందించాలని మూడు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు, పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీకి ఆదేశాలు జారీ చేసింది.

వ్యర్థాల దహనాలు గుర్తించేందుకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్, భారత్ స్కౌట్స్ బృందాల వినియోగం సరైనదేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కమిటీ ఏర్పాటుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. 15 రోజులకోసారి లేదా అవసరమైనప్పుడు కమిటీ నివేదిక అందించాలని సుప్రీంకోర్టు సూచించింది.

గాలి కాలుష్య కారకమైన పంటవ్యర్థాల దహనాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్రాలు పని చేయాలని ధర్మాసనం పేర్కొంది. దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలగాలని కమిటీని నియమిస్తూ సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి- అక్కడి రైతులకు ఆసరాగా ఎంకేపురం మిల్లెట్ బ్యాంక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.