ETV Bharat / bharat

'దేశాన్ని కాపాడేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలి' - పౌరసత్వ చట్ట సవరణ

పౌరసత్వ చట్ట సవరణ, దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్టికకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై ఉమ్మడి పోరుకు వ్యూహాలు రచిస్తున్నారు పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. సీఏఏ, ఎన్​ఆర్​సీపై పోరాటానికి ఒక్కతాటిపైకి రావాలని కోరుతూ.. విపక్షపార్టీల నేతలు, భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రలకు లేఖ రాశారు దీదీ. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ.. ఉమ్మడి పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మమత లేఖల అంశాన్ని తోసిపుచ్చారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​. దీదీ ప్రయత్నం విఫలమవుతుందని పేర్కొన్నారు.

Mamata
'దేశాన్ని కాపాడేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలి'
author img

By

Published : Dec 24, 2019, 5:11 AM IST

Updated : Dec 24, 2019, 7:56 AM IST

'దేశాన్ని కాపాడేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలి'

పౌరసత్వ చట్టం, ప్రతిపాదిత దేశవ్యాప్త జాతీయ పౌర పట్టిక (ఎన్​ఆర్​సీ)కి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేపట్టారు పశ్చిమ్​ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. భాజపాపై ఉమ్మడి పోరుకు వ్యూహాలు రచిస్తున్నారు. దేశాన్ని రక్షించేందుకు ఏకతాటిపైకి రావాలని కోరుతూ దేశంలోని పలు విపక్ష పార్టీల నేతలు, భాజపాయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు.. లేఖ రాశారు దీదీ.

దేశంలోని ప్రస్తుత పరిస్థితులను తన లేఖల్లో వివరించారు మమత. భాజపాయేతర పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రంలోని అమానుష పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని కోరారు. అధికార భాజపా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు దీదీ.

" నాలోని తీవ్రమైన ఆవేదనతో ఈ రోజు మీకు లేఖ రాస్తున్నా. పౌరసత్వ చట్టం, ప్రతిపాదిత దేశవ్యాప్త ఎన్​ఆర్​సీపై కులంతో సంబంధం లేకుండా ఈ దేశ పౌరులు, మైనారిటీలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు, రైతులు, ముఖ్యంగా పిల్లలు, మహిళలు భయాందోళనల్లో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనగా ఉన్నాయి. దేశంలో ఉన్న అమానుష పాలనకు వ్యతిరేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సీనియర్​ నాయకులు, రాజకీయ నేతలు అందరు కలిసికట్టుగా పోరాటం చేయాలని విన్నవిస్తున్నా. కేంద్రం చేస్తున్న రాజ్యాంగ విరుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుదాం. భారతదేశ ప్రజాస్వామ్య ఆత్మను కాపాడుదాం. "

-మమతా బెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి.

అగ్రనేతలకు విడివిడిగా లేఖలు..

పౌర చట్టం, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ.. నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ అధినేత శరద్​ పవార్​, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఫరూక్​ అబ్దుల్లాలకు విడివిడిగా లేఖలు రాశారు మమత.

మమతకు నిరాశే ఎదురవుతుంది

సీఏఏ, ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయాలనే మమత లక్ష్యం నెరవేరదని పేర్కొన్నారు బంగాల్​ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​. భాజపాకు వ్యతిరేకంగా గతంలో విపక్షాలు అన్ని కలిసి పనిచేయాలని ప్రయత్నించి విఫలమైయ్యాయని.. ఇప్పుడూ అదే జరుగుతుందని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: 'రాజ్యాంగంపై దాడి చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు'

AP Video Delivery Log - 2000 GMT News
Monday, 23 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1859: US NV Las Vegas Apartment Fire Must credit KTNV, No access Las Vegas, No use US broadcast networks, No re-sale, re-use or archive 4246117
Cause sought in fatal Las Vegas apartment fire
AP-APTN-1858: Syria Displaced AP Clients Only 4246116
Civilians flee latest offensive by Syrian military
AP-APTN-1844: Russia Pipeline AP Clients Only; Part No Access Russia; No use by Eurovision 4246115
Russia vows retaliation against US pipeline sanctions
AP-APTN-1804: US MN Party Shooting Must credit KSTP; No access Minneapolis-St. Paul; No use by US broadcast networks; No re-sale, re-use or archive 4246114
Eight shot, one fatally, outside Minnesota party
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 24, 2019, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.