మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఉమ్రానె గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ.2.5 కోట్లు వెచ్చించి ప్రశాంత్ విశ్వాస్‌రావు దేవరా అనే వ్యక్తి పదవిని దక్కించుకున్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జరిగిన ఈ వేలం.. కోటి పదకొండు లక్షలతో ప్రారంభమైంది.
కారణం అదే..
ఎన్నికల ప్రక్రియ లేకుండా గ్రామస్థులంతా సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకే ఈ వేలాన్ని నిర్వహించారు. ప్రశాంత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని గ్రామస్థులు ప్రకటించారు. అయితే ఈ వేలాన్ని అధికారికంగా నిర్వహించలేదు. వేలంలో వెచ్చించిన డబ్బుతో గ్రామంలో రామేశ్వరస్వామి ఆలయం నిర్మాణం చేపడతారని సమాచారం.
ఇదీ చూడండి : 'రజనీ ప్రకటన నన్నూ నిరాశపరిచింది'