శారదా కుంభకోణం కేసులో కీలక నిర్ణయం తీసుకుంది సర్వోన్నత న్యాయస్థానం. కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ అరెస్ట్‌పై ఉన్న రక్షణలను తొలగించింది. న్యాయపరమైన ఉపశమనం కోసం ఏడు రోజుల్లోగా సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.
"మేం రాజీవ్‌కుమార్ అరెస్టుపై ఫిబ్రవరి 5న జారీ చేసిన మధ్యంతర రక్షణలను ఎత్తివేస్తున్నాం. కోర్టు రక్షణ మరో ఏడు రోజుల పాటు కొనసాగుతుంది. అరెస్టు నుంచి ఉపశమనానికై రాజీవ్ కుమార్ కోర్టును ఆశ్రయించవచ్చు. శారదా కుంభకోణం కేసులో సీబీఐ చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు."
-సుప్రీంకోర్టు తీర్పు
బంగాల్లో రాజకీయంగా పెను దుమారం రేపిన శారదా కుంభకోణం కేసులో సాక్ష్యాలను రాజీవ్ కుమార్ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం.
ఇదీ చూడండి: భారత యూట్యూబ్ యోధుడి అరుదైన ఘనత