అక్రమస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు మరో షాక్ తగిలింది. కొడనాడ్, శిరుథవుర్లో ఉన్న రూ. 2వేల కోట్లు విలువైన ఆస్తులను.. ఆదాయపు పన్నుశాఖ బుధవారం అటాచ్ చేసింది.
రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా అన్నాడీఎంకే ప్రకటించిన కొద్ది గంటలకే ఐటీశాఖ ఈ చర్యలు చేపట్టడం గమనార్హం.
2017లో శశికళకు సంబంధించిన దాదాపు 150 ప్రాంతాల్లో ఐటీశాఖ రైడ్లతో విరుచుకుపడింది. అప్పటి నుంచి శశికళ, ఆమె సన్నిహితులపై అక్రమాస్తుల కేసులో భాగంగా ఆస్తులను అటాచ్ చేస్తూ వస్తోంది.
శశికళ ప్రస్తుతం కర్ణాటకలోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
ఇదీ చూడండి:- జనవరిలో చిన్నమ్మ రిలీజ్- అన్నాడీఎంకేలో గుబులు!