ETV Bharat / bharat

గాడ్సేను కీర్తించిన సాధ్వి- కాసేపటికే క్షమాపణ

భాజపా భోపాల్ లోక్​సభ అభ్యర్థి, మాలెగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్​ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాడ్సే దేశభక్తుడంటూ కొనియాడి భాజపాను ఇరకాటంలో పడేశారు. చివరకు పార్టీ ఒత్తిడితో క్షమాపణ చెప్పారు.

గాడ్సేను కీర్తించిన సాధ్వి- కాసేపటికే క్షమాపణ
author img

By

Published : May 16, 2019, 7:32 PM IST

Updated : May 16, 2019, 8:20 PM IST

గాడ్సేను కీర్తించిన సాధ్వి- కాసేపటికే క్షమాపణ

భోపాల్‌ భాజపా లోక్‌సభ అభ్యర్థి, మాలేగావ్‌ పేలుళ్ల కేసు నిందితురాలు స్వాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, మక్కల్​ నీది మయ్యమ్​ అధినేత కమల్​హాసన్ వ్యాఖ్యలపై సాధ్వి ఇలా స్పందించారు.

"గాడ్సే దేశభక్తుడు. ఎప్పటికీ దేశభక్తుడే. తనను ఉగ్రవాది అన్న వారు ముందు వాళ్ల గురించి ఆలోచించుకోవాలి. ఈ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెబుతారు."
-సాధ్వి ప్రజ్ఞా సింగ్​ ఠాకూర్, భాజపా నేత

ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలను భాజపా ఖండించింది.

"మహాత్మాగాంధీ పట్ల ఆమె వ్యాఖ్యలతో మేం పూర్తిగా విభేదిస్తున్నాం. తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ ఆమె అలా ఎందుకు మాట్లాడారో వివరణ కోరుతుంది. ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలపై వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి."
-జీవీఎల్ నరసింహరావు, భాజపా అధికార ప్రతినిధి

భాజపా అధినాయకత్వం ఒత్తిడితో కొద్ది గంటల వ్యవధిలోనే క్షమాపణ చెప్పారు సాధ్వి.

కొత్త కాదు...
దిగ్విజయ్ సింగ్​పై లోక్​సభ ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచి ప్రజ్ఞా సింగ్​ వివాదాస్పద వ్యాఖ్యలతో భాజపాను ఇరకాటంలో పడేస్తున్నారు. ముంబయి ఉగ్రదాడిలో అమరుడైన ఐపీఎస్ హేమంత్ కర్కరేపైనా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. చివరకు పార్టీ ఒత్తిడితో వాటిని ఉపసంహరించుకున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : May 16, 2019, 8:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.