ETV Bharat / bharat

అయోధ్య కేసు నుంచి న్యాయవాది ధావన్​ తొలగింపు

author img

By

Published : Dec 3, 2019, 3:24 PM IST

అయోధ్య కేసు నుంచి సీనియర్​ న్యాయవాది రాజీవ్ ధావన్​ను తప్పించారు ముస్లిం కక్షిదారులు. ఈ నిర్ణయాన్ని రాజీవ్​ ధావన్​ కూడా అంగీకరించారు. ఇకపై తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఈ సీనియర్ న్యాయవాది స్పష్టం చేశారు. అయితే అనారోగ్యం వల్లనే తనను తొలగిస్తున్నట్లు చెప్పడాన్ని ధావన్​ తప్పుబట్టారు.

Sacked from Ayodhya case, says Muslim parties' lawyer Rajeev Dhavan
అయోధ్య కేసు నుంచి న్యాయవాది ధావన్​ తొలగింపు

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజీవ్​ ధావన్​ను అయోధ్య భూవివాదం కేసు నుంచి ముస్లిం కక్షిదారులు తొలగించారు. ధావన్​ అనారోగ్యంతో బాధపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు.

ఇకపై ఎలాంటి సంబంధం లేదు..

ముస్లిం కక్షిదారుల నిర్ణయాన్ని అంగీకరించినట్లు రాజీవ్ ​ధావన్​ ఫేస్​బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు.

"జమియాత్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న(ఎడ్వకేట్ ఆన్​ రికార్డ్) ఎజాజ్​ మక్బూల్ నన్ను తొలగించారు. ఇందుకు అంగీకరించి నేను అధికారిక లేఖ పంపాను. ఇకపై అయోధ్య కేసు సమీక్షతో నాకు ఎలాంటి సంబంధంలేదు." - రాజీవ్​ ధావన్​, సీనియర్ న్యాయవాది

అందులో వాస్తవం లేదు..

అనారోగ్యం వల్లనే తనను తొలగించినట్లు ముస్లిం కక్షిదారులు పేర్కొనడం... పూర్తిగా అవాస్తవమని రాజీవ్​ తెలిపారు. ఒకవేళ అనారోగ్యంతో ఉంటే... ఇతర కేసుల విషయమై కోర్టుకు ఎలా హాజరవుతున్నానని ఆయన ఎదురు ప్రశ్నించారు.

విభజించాలనుకోవడం లేదు..

ముస్లిం పార్టీలను విభజించడం తనకు ఇష్టం లేదని రాజీవ్​ ధావన్​ పేర్కొన్నారు.

"అయోధ్య కేసు విషయంలో నేను ముస్లింపార్టీలన్నింటి తరపున వాదించాను. ఇప్పటికీ అదే కోరుకుంటున్నాను. ముస్లింపార్టీలు ముందుగా తమ విబేధాలను పరిష్కరించుకోవాలి."- రాజీవ్​ ధావన్​, సీనియర్ న్యాయవాది

పిటిషన్ వేసిన మరుసటి రోజే..

సుప్రీంకోర్టు 'అయోధ్య' తీర్పును సవాల్ చేస్తూ 'జమాత్​ ఉలేమా ఇ హింద్' అధినేత మౌలానా అర్షద్​ మదానీ సోమవారం సమీక్ష పిటిషన్ దాఖలు చేశారు. మరుసటిరోజే న్యాయవాది రాజీవ్​ ధావన్​ను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి: 'దిశ' కేసు దోషులకు శిక్షపై జయ అలా... హేమ ఇలా...

New Delhi, Dec 2 (ANI): Rajya Sabha Chairman M Venkaiah Naidu on recent crimes against women, asserted that new bill won't help much and there is a requirement of political will, change of mindset to curb such issues. "What is required is not a new bill. What is required is political will, administrative skill, change of mindset and then go for kill of the social evil," said Rajya Sabha Chairman Naidu. Several horrific crimes against women from various areas in the country have been reported lately.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.