ETV Bharat / bharat

కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ భక్తుల 'అయ్యప్ప దర్శనం'

author img

By

Published : Oct 17, 2020, 12:05 PM IST

ఆరునెలల తరువాత మొదటిసారి శబరిమల అయ్యప్ప ఆలయం శుక్రవారం సాయంత్రం తెరుచుకుంది. శనివారం ఉదయం 5గంటల నుంచి భక్తులను అనుమతిస్తున్నట్లు ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు తెలిపింది. కరోనా దృష్ట్యా వర్చువల్​ క్యూ పద్ధతి ద్వారా రోజుకు కేవలం 250మందికే ఆలయ ప్రవేశం కల్పిస్తున్నారు.

Sabarimala temple opens for devotees
ఆరు నెలల తరువాత తెరుచుకున్న శబరిమల ఆలయం

కరోనా మహమ్మారి కారణంగా మార్చి25న మూసివేసిన శబరిమల దేవాలయం శుక్రవారం తెరుచుకుంది. ఇవాళ ఉదయం నుంచి భక్తులకు ఆలయ దర్శనం కల్పిస్తోంది ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు. వైరస్​ వ్యాప్తి దృష్ట్యా.. భక్తులు మాస్కులు ధరించి, కొవిడ్​ నెగెటివ్​ రిపోర్టు పత్రంతో దర్శనానికి రావాలని బోర్డు సూచించింది. ఈ నేపథ్యంలో.. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూనే భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. మండల పూజ కోసం.. అక్టోబరు 21వరకు ఆలయం తెరుచుకొనే ఉండనుంది. కొవిడ్​ నెగెటివ్​ రిపోర్టు లేని వారికి నీలక్కల్​లో రాపిడ్ యాంటిజెన్​ టెస్టులు​ నిర్వహిస్తున్నారు.

Sabarimala temple opens for devotees
మాస్కులు ధరించి దర్శనానికి
Sabarimala temple opens for devotees
భౌతికదూరం పాటిస్తూ దర్శనానికి వస్తోన్న భక్తులు

వర్చువల్​ విధానంలో దర్శనం :

వర్చువల్​ క్యూ పద్ధతి ద్వారా శనివారం దర్శనానికి 246 మంది దరఖాస్తు చేసుకున్నారు. రోజుకు కేవలం 250మందినే ఆలయంలోకి అనుమతించనున్నారు.

Sabarimala temple opens for devotees
కొవిడ్​ నిబంధనల మధ్య దర్శనం

10 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండి మెడికల్​ సర్టిఫికేట్​ ఉన్నవారిని కొండ ఎక్కి వచ్చేందుకు అనుమతిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా సన్నిధానం, నీలక్కల్​లోని వసతి గృహాలను మూసివేశారు.

Sabarimala temple opens for devotees
స్వామియే శరణం అయ్యప్ప

ఇదీ చదవండి :దేశవ్యాప్తంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.