నెలవారీ ఐదురోజుల పూజా కార్యక్రమం కోసం శబరిమల దేవస్థానం అక్టోబర్ 16న తెరుచుకుంది. దాదాపు 7 నెలల తర్వాత ఆలయాన్ని తెరిచారు. అక్టోబర్ 17 నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
కరోనా టెస్టు పక్కా..
భక్తులు పంబా చేరుకోవడానికి 48 గంటల ముందే కరోనా టెస్టు చేయించుకోవాలి. నిలక్కల్ ప్రాంతాల్లో కరోనా టెస్టింగ్ కేంద్రంలోనూ పరీక్షలు చేస్తారు. నెగెటివ్ వస్తేనే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ప్రతిరోజు 250 మంది భక్తులకే ఈ అవకాశం రానుంది. సన్నిదానం చేరడానికి వర్చువల్ క్యూ పద్ధతి పాటించాల్సి ఉంటుంది.
స్వామి అయ్యప్పన్ రోడ్డు మార్గం నుంచి మాత్రమే సన్నిధానానికి అనుమతి ఇస్తున్నారు. అడవుల దారి నుంచి నో ఎంట్రీ ప్రకటించింది దేవస్థానం బోర్డు. కరోనా నేపథ్యంలో మాస్క్లు ధరించి, కొండమార్గాల్లో చేరుకోవడం భక్తులకు ఇబ్బందిగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకుంది. అభిషేకం కోసం నెయ్యిని సమర్పించే భక్తులు.. ప్రత్యేక కౌంటర్లో అందజేయాల్సి ఉంటుంది. ప్రసాదాన్ని కూడా అక్కడే ఇవ్వనున్నారు.