ETV Bharat / bharat

ఈ నెల 16న తెరుచుకోనున్న శబరిమల దేవస్థానం - kerala adavula daari

ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం.. ఈ నెల 16 నుంచి పునఃప్రారంభం కానుంది. కరోనా పరీక్షల్లో నెగెటివ్​ వచ్చిన భక్తులు మాత్రమే దర్శనానికి రావాలని తెలిపింది ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు. భక్తులకు ఈసారి అడవుల నుంచి వచ్చేందుకు అనుమతి లేదని చెప్పింది.

Sabarimala pilgrim season  No entry for pilgrims via traditional forest pathway
ఈ నెల 16 నుంచి తెరుచుకోనున్న శబరిమల దేవస్థానం
author img

By

Published : Oct 10, 2020, 2:28 PM IST

Updated : Oct 10, 2020, 4:31 PM IST

ఈ నెల 16న తెరుచుకోనున్న శబరిమల దేవస్థానం

నెలవారీ ఐదురోజుల పూజా కార్యక్రమం కోసం శబరిమల దేవస్థానం అక్టోబర్​ 16 నుంచి మళ్లీ తెరుచుకోనుంది. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు అనుసరించాల్సిన నిబంధనలపై ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు సమావేశమైంది. అడవుల దారి నుంచి ఈ ఏడాది దర్శనానికి అనుమతించట్లేదని తెలిపింది. ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్​ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది.

కరోనా నేపథ్యంలో..

స్వామి అయ్యప్పన్​ రోడ్డు మార్గం నుంచి మాత్రమే సన్నిధానానికి రావాలని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు సూచించింది. కరోనా నేపథ్యంలో.. మాస్క్​లు ధరించి, కొండమార్గాల్లో చేరుకోవడం భక్తులకు ఇబ్బందిగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

నెగెటివ్​ వచ్చినవారు మాత్రమే..

కొవిడ్​ యాంటిజెన్​ పరీక్షలో నెగెటివ్​ వచ్చిన వారు మాత్రమే స్వామి దర్శనం చేసుకోవాలని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. అభిషేకం కోసం నెయ్యిని సమర్పించే భక్తులు.. ప్రత్యేక కౌంటర్​లో అందజేయాలని తెలిపింది. ప్రసాదాన్ని కూడా అక్కడే తీసుకోవాలని సూచించింది. నిలక్కల్​లో భక్తుల్ని పరీక్షించేందుకు ఆరోగ్య కార్యకర్తల బృందం ఉంటుందని తెలిపింది.

"శబరిమల దేవస్థానంలో వలంటీర్​, ఆరోగ్య కార్యకర్తలుగా విధులు నిర్వర్తించేవారిని ఆరోగ్యశాఖతో పాటు దేవస్థానం గుర్తిస్తుంది. భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలి. ఈ నెలలో జరిగే తులమ్​ మాసమ్​ పూజలోనూ ఇవే నియమాలు వర్తిస్తాయి. "

-- ఎన్​ విజయకుమార్​, ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు సభ్యుడు.

కొవిడ్​ ఆరోగ్య నిబంధనలను ఆలయ సిబ్బంది సహా భక్తులు, అధికారులు అందరూ పాటించాల్సిందేనని ఆ రాష్ట్ర పోలీస్​ ఛీఫ్​ లోక్​నాథ్​ బెహెరా తెలిపారు.

ఇదీ చూడండి:అయోధ్య రామాలయం ప్రాంతానికి శిలల తరలింపు

Last Updated : Oct 10, 2020, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.