ఇప్పటి వరకు డీజిల్, పెట్రోల్, విద్యుత్‌తో నడిచే వాహనాల ఇంజిన్లు మాత్రమే చూసుంటాం. కానీ... మూడింటితోనూ ఖర్చు అధికం, పర్యావరణానికి ప్రమాదం. భూమి మీద విరివిగా లభించే నీటితో నడిచే ఇంజిన్ తయారు చేస్తే ఎలా ఉంటుంది..? భలే ఉంటుంది కదూ...! ఇప్పుడు ఇదే కలను నిజం చేశారు తమిళనాడు కోయంబత్తూర్‌కు చెందిన ఎస్ కుమారస్వామి.
మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులైన కుమారస్వామి దాదాపు 10 ఏళ్ల పాటు శ్రమించి ఈ యంత్రాన్ని రూపొందించారు. ప్రపంచంలో డిస్టిల్డ్ నీటితో నడిచే మొదటి ఇంజిన్‌గా ఈ యంత్రం రికార్డులకెక్కింది.
పూర్తిగా స్వేదజలంతో నడిచే ఈ ఇంజిన్ హైడ్రోజన్‌ను ఇంధనంగా వినియోగించుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందంటున్నారు రూపకర్త కుమారస్వామి. పర్యావరణ హితమైన ఈ ఆవిష్కరణపై జపాన్‌కు చెందిన వాణిజ్య సంస్థ (జెట్రో) ఆసక్తి కనబరిచింది.
"ఈ ఇంజిన్‌ను భారత్‌లో పరిచయం చేయడం నా కల. ఈ విషయం గురించి తెలిసిన ప్రతి అధికారి తలుపు తట్టా. కానీ ఎవరి దగ్గర నుంచి సానుకూల స్పందన రాలేదు. అందుకే జపాన్ ప్రభుత్వంతో చర్చించాను. అవకాశం దక్కింది. రాబోయే కాలంలో ఈ ఇంజిన్ జపాన్‌లో పరిచయమవుతుంది."
-ఎస్. కుమారస్వామి, ఇంజిన్ సృష్టికర్త
- ఇదీ చూడండి: గంగా సప్తమిన వారణాసిలో ప్రత్యేక పూజలు