తమ తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలగాలని భారతీయ సంప్రదాయంలో పిండప్రదానం చేశారు కొంతమంది రష్యా మహిళలు. బిహార్ గయలో మోక్షదాయినిగా భావించే ఫల్గు నది నీటితో తర్పణం చేశారు.
రష్యాకు చెందిన ఆరుగురు మహిళలు గయలోని విష్ణుపథం మందిరానికి వచ్చారు. మందిర ప్రాంగణంలో తల్లిదండ్రులకు హిందూ ఆచారం ప్రకారం పిండప్రదానం చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి ఈ ఘట్టాన్ని నిర్వహించారు.
"మా తండ్రిదండ్రులకు తర్పణం చేసేందుకు మేం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు గయ ప్రత్యేక పుణ్యక్షేత్రం."
-రూరోసి, రష్యా మహిళ
గయలో ఏటా జరిగే పితృతర్పణ మేళాకు దేశ విదేశాల నుంచి లక్షల మంది వస్తుంటారు. తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలగాలని భక్తిశ్రద్ధలతో పిండప్రదానం చేస్తుంటారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు కొనసాగుతుంది.
ఇదీ చూడండి: ముఖకవళికలతో విద్యార్థుల మానసిక స్థితి అంచనా..!