ETV Bharat / bharat

'భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు'

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు ఇస్తుందని ప్రకటించారు ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లావరోవ్. శాశ్వత సభ్యత్వానికి భారత్ బలమైన పోటీదారు అని పేర్కొన్నారు.

un russia
'భద్రతా మండలి శాశ్వత సభ్యత్వానికి మా మద్దతు'
author img

By

Published : Jun 23, 2020, 5:42 PM IST

భారత్​కు భద్రతామండలి శాశ్వత సభ్యత్వం కల్పించే అంశమై ఇప్పటివరకు మద్దతు ఇస్తూ వస్తోన్న రష్యా.. ఇకముందు ఈ దిశగా సహకారం కొనసాగిస్తామని ప్రకటించింది. ఈ మేరకు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్​ ప్రకటించారు. భారత్​, రష్యా, చైనా త్రైపాక్షిక భేటీలో భాగంగా ఈ విషయాన్ని తెలిపారు లావరోవ్. శాశ్వత సభ్యత్వానికి భారత్ బలమైన పోటీదారు అని పేర్కొన్నారు. భారత్..​ భద్రతా మండలి శాశ్వత సభ్య దేశంగా అవతరిస్తుందని తమకు నమ్మకం ఉందని ఉద్ఘాటించారు.

'భారత్, చైనాకు బయటి శక్తుల సాయం అనవసరం'

అంతర్గత వ్యవహారాలు సహా ఇతర అంశాల్లో భారత్- చైనాలకు బయటి శక్తుల సాయం అనవసరమని భావిస్తున్నట్లు చెప్పారు లావరోవ్. సరిహద్దు సహా వివిధ సమస్యలను భారత్​- చైనాలు ద్వైపాక్షికంగా, శాంతియుతంగానే పరిష్కరించుకుంటాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్షణ అధికారులు, విదేశాంగమంత్రుల స్థాయిలో ఇప్పటికే చర్చలు ప్రారంభించాయని గుర్తు చేశారు.

ఇదీ నేపథ్యం..

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శాశ్వత సభ్యత్వం సాధించడం.. పలు సంవత్సరాలుగా భారత్​కు నెరవేరని లక్ష్యంగా పరిణమిస్తూ వస్తోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్​, చైనా, రష్యాలు ఇప్పటివరకు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. ఏదైనా దేశానికి శాశ్వత హోదా ఇవ్వాలంటే సభ్యదేశాలన్నింటి అంగీకారం ఉండాలన్న నిబంధనను అడ్డం పెట్టుకుని.. భారత ప్రవేశానికి చైనా మోకాలడ్డుతోంది.

ఇదీ చూడండి: చైనా మంత్రి ఎదుటే డ్రాగన్​పై జైశంకర్​ పంచ్​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.