అయోధ్య రామ జన్మభూమిలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఈ కార్యక్రమం ద్వారా రామ మందిర నిర్మాణాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తొలుత ప్రకటించినా... అలా చేయలేదు.
కుబేర తిలా క్షేత్రం వద్ద నిర్వహించిన రుద్రాభిషేకంలో పాల్గొన్న మహంత్ కమల్ నయన్ దాస్... ఆలయ నిర్మాణం త్వరగా ప్రారంభం కావాలని భగవంతుడ్ని ప్రార్థించినట్లు చెప్పారు.
రామ మందిర ట్రస్టు సారథి మహంత్ నృత్య గోపాల్ దాస్‌కు కమల్ నయన్ దాస్ అధికార ప్రతినిధి.
ప్రకటనకు భిన్నంగా...
రుద్రాభిషేకం పూర్తయ్యాక రామాలయానికి భూమిపూజ జరుగుతుందని సోమవారం ప్రకటించారు కమల్ నయన్ దాస్. కానీ... బుధవారం ముహూర్త సమయానికి రామ మందిర ట్రస్టు సభ్యులు ఎవరూ రాలేదు. మణి రామ్ చౌనీ ఆలయ అర్చుకులు మాత్రమే రాగా... వారితో కలిసి పూజలు నిర్వహించారు కమల్ నయన్ దాస్.
ఇదీ చూడండి: కొవిడ్‌పై పోరుకు ఆవు యాంటీబాడీలు!