ETV Bharat / bharat

సమాచారానికి స్వేచ్ఛ ఎక్కడుంది..? - RTI

సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి పద్నాలుగేళ్లు దాటినా అదింకా బాలారిష్టాల దశలోనే కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటి వరకు సమాచార కమిషనర్ల భర్తీ ప్రహసనంగానే సాగుతోంది. మరోవైపు నియామకాల్ని బిగబట్టి లేదా అస్మదీయుల పునరావాస శిబిరాలుగా వాటిని దిగజార్చి ప్రభుత్వాలు చేస్తున్న రాజకీయ గారడీ పౌరుల సమాచార హక్కుకే ఉరితాళ్లు పేనుతోంది!

RTI ACT IS EXERCISE PROPERLY?
సమాచారానికి స్వేచ్ఛ ఎక్కడుంది?
author img

By

Published : Dec 18, 2019, 8:36 AM IST

పరిపాలనలో పారదర్శకత ప్రజల పట్ల మరింత బాధ్యత, జవాబుదారీతనాలకు ప్రోది చేస్తుందని, దానివల్ల పని సంస్కృతిలో మంచి మార్పులు వచ్చి ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలిస్తాయంటూ సమాచార హక్కు స్ఫూర్తిగానం సాక్షాత్తు ప్రధాని మోదీ నోట నిరుడు మార్చిలో వెలువడింది. దురదృష్టమేమిటంటే, అవినీతి తిమిరాన్ని తరిమేందుకంటూ సమాచార హక్కు చట్టాన్ని తెచ్చి పద్నాలుగేళ్లు దాటినా అదింకా బాలారిష్టాల దశలోనే కిందుమీదులవుతోంది! కేంద్ర ఆర్టీఐ చట్టం నిర్దేశాల అనుసారం కేంద్ర, రాష్ట్రస్థాయుల్లో ఏర్పాటయ్యే సమాచార సంఘాల్లో ఒక చీఫ్‌తో పాటు గరిష్ఠంగా పదిమంది కమిషనర్లు ఉండాలి. నిరుడు మార్చినాటికి దేశవ్యాప్తంగా సమాచార సంఘాల్లో 153 కమిషనర్లు, చీఫ్‌ల పోస్టులు మంజూరైనా వాటిలో పాతిక శాతం దాకా ఖాళీలు వెక్కిరించాయి. ఆ దురవస్థను దునుమాడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ మొన్న ఫిబ్రవరి 15న ‘సుప్రీం’ ద్విసభ్య ధర్మాసనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విస్పష్ట మార్గనిర్దేశం చేసింది. దాన్ని ప్రభుత్వాలు పట్టించుకోనేలేదంటూ మరోసారి తన తలుపు తట్టిన వ్యాజ్యంలో ‘సుప్రీం’ త్రిసభ్య ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లోని సమాచార సంఘాల్లో ఖాళీల్ని మూడు నెలల్లోగా భర్తీ చేయాలని తాజాగా ఆదేశించింది.

సుప్రీం గిరీ..!

సమాచార కమిషనర్ల నియామకానికి అర్హుల్ని గుర్తించే అన్వేషణ కమిటీ సభ్యుల పేర్లను రెండు వారాల్లోగా ప్రభుత్వ వెబ్‌సైట్లో పేర్కొనాలనీ స్పష్టీకరించింది. సమాచార కమిషనర్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు- అభ్యర్థుల వడపోతకు ఎంచుకొన్న ప్రాతిపదికల్నీ అన్వేషణ కమిటీ బహిర్గతం చెయ్యాలని ఫిబ్రవరి నాటి తీర్పు నిర్దేశిస్తే- అన్వేషణ కమిటీ సభ్యుల పేర్లు అందరికీ తెలియాల్సిందేనని సరికొత్తగా ‘సుప్రీం’ గిరిగీసింది. సమాచార హక్కు చట్టం సక్రమంగా అమలుకు నోచుకోవాలంటే, చట్టం స్ఫూర్తిని నిలబెట్టే నిబద్ధతగల నిష్ణాతులతో ఆయా సంఘాలు పరిపుష్టం కావాలి. నియామకాల్ని బిగబట్టి లేదా అస్మదీయుల పునరావాస శిబిరాలుగా వాటిని దిగజార్చి ప్రభుత్వాలు చేస్తున్న రాజకీయ గారడీ పౌరుల సమాచార హక్కుకే ఉరితాళ్లు పేనుతోంది!

అసలు సమాచార స్వేచ్ఛ ఎందుకు అన్న మౌలిక ప్రశ్నకు 2005 జూన్‌లో వెలువరించిన రాజపత్రమే సవివర సమాధానం అందించింది. సమాచార పారదర్శకత ప్రజాస్వామ్యం మనుగడకు ఎంతో కీలకం గనుక, అవినీతిని నియంత్రించడానికే కాదు; ప్రభుత్వాల్నీ వాటి విభాగాల్ని జవాబుదారీ చేస్తుంది కాబట్టి- అంటూ సమాచార హక్కు ఘనతను సరిగ్గా గుర్తించింది. దశాబ్దాల తరబడి అధికార రహస్యాల చట్టం మాటున దట్టంగా ముసురుకొన్న అవినీతి, జాతి నవనాడుల్ని ఎంతగా నలుచుకుతిన్నదీ తెలిసిందే. ఎక్కడికక్కడ అవినీతి చీకట్లను పోకార్చేలా సమాచార సూర్యకిరణాల ప్రసరణానికి తలుపులు బార్లా తెరవాల్సిన ప్రభుత్వాలు- పౌరుల్లో పొంగులువారుతున్న సమాచార చొరవపై నీళ్లు చల్లే నిర్వాకాలు వెలగబెట్టడం ఇప్పటికీ కొనసాగుతున్నదే!

ఆశ్రిత పక్షపాతంతో...

గత నెలాఖరున నలుగురి పదవీ విరమణ దరిమిలా కేంద్ర సమాచార సంఘంలో మొత్తం 11 మందికిగాను ఎనిమిది పోస్టులు ఖాళీ అయ్యాయి. సమాచార సంఘాల్ని నామమాత్రావశిష్టంగా మార్చి ఎన్నో రాష్ట్రాలు రోజులు నెట్టుకొస్తున్నాయి. సమాచార కమిషనర్ల నియామకాలు జరిగిన చోటా ఆశ్రిత పక్షపాతం ఎంతగా వెర్రితలలు వేసిందో లోగడ తెలుగు రాష్ట్రాల్లోనే పలు రుజువులు పోగుపడ్డాయి. ప్రజాజీవనంలో తలపండిన భిన్నరంగాల లబ్ధప్రతిష్ఠులకు సమాచార సంఘాల్లో చోటుపెట్టేందుకు చట్టం కల్పించిన వెసులుబాటు ఆధారంగా గజ్జెకట్టిన దుర్రాజకీయాలకు ఏ రాష్ట్రమూ మినహాయింపు కాదు. నియామక క్రతువు ఆద్యంతం భ్రష్టుపట్టిందంటూ రెండేళ్ల క్రితం కేరళ హైకోర్టు అయిదుగురు కమిషనర్ల ఎంపికను అడ్డంగా కొట్టేసింది. ఎంచబోతే మంచమంతా కంతలే అన్నట్లున్న ప్రస్తుత పరిస్థితి- ప్రభుత్వాల్లో కొడిగట్టిన సమాచార స్వేచ్ఛా పిపాసనే పట్టిస్తోంది!

దేశవ్యాప్తంగా ఏటా 40-60 లక్షల ఆర్టీఐ దరఖాస్తులు వెల్లువెత్తుతున్న తీరు సమాచార ప్రభా భాస్కరులై పౌరులు కదం తొక్కుతున్న వాస్తవానికి అద్దం పడుతోంది. ప్రజానీకం కోరుతున్న సమాచారంలో దాదాపు 44 శాతం ప్రభుత్వాలు వాటంతట అవే బహిర్గత పరచాల్సినవేనంటున్న అధ్యయనాలు- చట్టం స్ఫూర్తి ప్రభుత్వాలకే ఒంటపట్టలేదని రుజువు చేస్తున్నాయి. అధికారంలో ఉన్నంతకాలం పాలకుల ప్రయోజనాలకే కావలి కాసిన సివిల్‌ సర్వెంట్లనే ఏరికోరి సమాచార సంఘాల పెద్ద దిక్కుగా నియమించే జాడ్యమూ పెరిగిపోయింది. దానాదీనా పౌరులు కోరిన సమాచారాన్ని ఏదో ఒక వంకన నిరాకరించే ధోరణులూ ప్రబలుతున్నాయి. సమాచార సంఘాల్లోనూ పెండింగ్‌ అర్జీల కొండలు పెరిగి ప్రజల్లో సమాచార గ్రహణ ఆసక్తికీ గ్రహణం పట్టిస్తుండబట్టే, సంబంధిత సూచీలో ఇండియా ర్యాంకు ఏటికేడు పడిపోతోంది.

నిశిత సమీక్ష చేయాలి..

సమాచార కమిషనర్ల పదవీకాలం, జీతనాతాలపై కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టం- ఆర్టీఐ మౌలిక లక్ష్యాలపై పరోక్ష దాడి అని సమాచారోద్యమ కార్యకర్తలు మొత్తుకొంటున్నారు. నిజాయతీపరులైన అధికారులు స్వేచ్ఛగా స్వీయ అభిప్రాయాలు చెప్పలేక పోతున్నారంటూ సమాచార చట్టాన్ని నిశితంగా సమీక్షించాల్సి ఉందని 2011లో ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అదే కారణాన్ని ప్రస్తావించి నిర్దిష్ట మార్గదర్శకాల అవసరాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టే ప్రస్తావించడం- తీవ్రాందోళనకరమనడంలో సందేహం లేదు. నిజాయతీపరులైన అధికారులకు ఈ చట్టం ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందన్న మాజీ ఐఏఎస్‌ అధికారి అరుణారాయ్‌ వ్యాఖ్యల్లోని వాస్తవాన్ని గ్రహించి- సుపరిపాలనకు సరైన సాధనంగా ఆర్టీఐని శక్తిమంతం చేయడం- ప్రజాప్రభుత్వాల విహిత కర్తవ్యం!

ఇదీ చూడండి: అంచనాలు తప్పి బేజారు.. తగ్గిన జీఎస్టీ వసూళ్లు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Washington, DC, USA. 17th December 2019.
+++ PLEASE NOTE: VIDEO QUALITY AS INCOMING +++
1. 00:00 SOUNDBITE (English): Mark Rizzo, Washington Nationals General Manager:
"Well, exciting day here in Washington, DC, to return one of our own in Stephen Strasburg. I think it's a hugely important day for the franchise. I couldn't be happier personally and professionally. I like to give a shout out and thank you to our ownership group for giving us the resources to make Stras a National for life and I couldn't be happier for you to spend the rest of your career with the Washington Nationals."
2. 00:33 SOUNDBITE (English): Stephen Strasburg, Washington Nationals Pitcher:
"I mean to be honest throughout my career I've been so fortunate to have the backing of the team, the ownership and they've made it very clear they want me to be a part of this organization moving forward and throughout the course of my career there's been ups and downs but they've supported me throughout it all and I think that's hard to come by in this game and it's just creating an environment that I feel I can thrive in and achieve what I wanted to do on the field and off the field as well."
3. 01:11 SOUNDBITE (English): Stephen Strasburg, Washington Nationals Pitcher:
"I mean like it was touched on earlier it's really hard to come by in this game and I think when you're given an opportunity to be in one spot and grow as a person and a player, to be a part of an organization like this, you can't really let those opportunities go by. Looking back on when I got drafted it's amazing to see how all the experiences have made me stronger as a person and through the adversity that's what I've learned to kind of welcome the challenge and know that it's just not going to be easy and it's just something that you put your head down and keep working at it and you can achieve anything."
SOURCE: WJLA
DURATION: 02:00
STORYLINE:
World Series MVP Stephen Strasburg spoke to the media on Tuesday, a week after signing a $245 million, seven-year contact with the Washington Nationals.
The 31-year-old right-hander with an injury-filled resume received the highest deal for a pitcher in both total dollars and average annual value at $35 million USD - until Gerrit Cole signed with the New York Yankees days later.
After helping win the first World Series title in the 51-season history of the Montreal/Washington franchise, Strasburg gave up $100 million he had been guaranteed from 2020-23 as part of a $175 million, seven-year contract he agreed to in May 2016 and became a free agent.
He was 18-6 with a 3.32 ERA this season, topping 30 starts for the second time in his career and leading the NL with 209 innings. He went 5-0 with a 1.98 ERA in five postseason starts and one relief appearance, including wins in Games 2 and 6 of the World Series against Houston.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.