అయోధ్య కేసులో సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువరించే అవకాశం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) విశ్వాసం వ్యక్తం చేసింది.
ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఆర్ఎస్ఎస్ మూడు రోజులపాటు 'అఖిల భారతీయ కార్యకారి మండల్' నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్, సంస్థ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ భయ్యాజీ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తుందా అన్న ప్రశ్నకు జోషి బదులిచ్చారు.
"తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నా. అలానే జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ)ని ఆర్ఎస్ఎస్ సమర్థిస్తోంది. దేశ సంక్షేమం కేసం అన్ని రాష్ట్రాలు ఎన్ఆర్సీని అంగీకరించి అమలుచేయాలి." - భయ్యాజీ జోషి, ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి
అయోధ్య కేసు విచారణను బుధవారంతో ముగించిన సుప్రీంకోర్టు...తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
ఇదీ చూడండి: రూ. 990 కోట్లకు చేరిన రిలయన్స్ జియో నికర లాభం