సమాజంలో జరిగే సంఘటనలను వ్యాపార అవకాశాలుగా మార్చుకోవడంలో వాణిజ్య వర్గాలు ముందుంటాయి. ప్రత్యేక సందర్భాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పటి వరకూ ప్రచారాన్ని చేసేవి. తాజాగా ఓ అడుగు ముందుకేశాయి.
బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ ట్విట్టర్లో.. అరటిపండ్లపై చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. జులై 22న ఓ హోటల్లో రెండు అరటిపండ్లకు రూ. 442.50 బిల్లు వేయడాన్ని నిరసిస్తూ ఆయన పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వ్యాపార ఆలోచనగా మార్చుకుని తమ వస్తువులు రెండు అరటి పండ్ల ధరతో పోల్చితే ఎంత తక్కువో...అంతే ధరకు ఎన్ని వస్తువులు వస్తాయో.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే వ్యాపార అస్త్రంగా మలిచేశాయి.
'రూ. 442' ఘటనతో అంతే మొత్తంలో అమెజాన్‌లో కొనగలిగే వస్తువులపై ఆ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది.
ఐసింగ్ సంస్థ... రెండు అరటి పండ్లతో తమ వస్తువును పోలుస్తూ రూ.280కే పొందండి అని వెల్లడించింది.
పాలసీ బజార్.కామ్ ఓ అడుగు ముందుకేసి రెండు అరటి పండ్ల ఖర్చుతోనే అద్భుతమైన బీమా అని ప్రచారం చేస్తోంది.
రూ. 99తో పిజ్జాను కొనే బదులు రూ. 442తో ఒక పండు కొంటారా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రచారానికి దిగింది పిజ్జా హట్.
రిలయన్స్ ఫ్రెష్లోనైతే రూ. 442కు ఇన్ని పండ్లొస్తాయి అంటూ ప్రచారం చేస్తోందా కంపెనీ.
గోద్రెజ్ నేచర్ బాస్కెట్ మా అరటి పళ్లను వద్దనడానికి అవేమీ రూ. 442 కాదు కేవలం రూ. 14 మాత్రమే అంటూ ప్రచారం చేస్తోంది.
రూ. 442కు మీకు 'ఓయో'లో ఓ గది లభ్యమవుతుందోచ్... అంటూ ఓయో రూమ్స్ ప్రచారాన్ని చేస్తోంది.
హోటల్‌కు జరిమానా
'వైరల్‌గా మారిన రెండు అరటిపండ్ల వీడియో' చండీగఢ్ ఎక్సైజ్, పన్నుల శాఖ కమిషనర్ మణ్‌దీప్ సింగ్ భర్ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనపై విచారించిన ఆయన సంబంధిత హోటల్‌కు రూ. 25వేల జరిమానా విధించారు.
ఇదీ చూడండి: 'హిజ్బుల్' ఉగ్రవాది అహ్మద్ తాంతరీ అరెస్ట్