తమిళనాడులో రోడ్డు పక్కన నివసించేవారింట్లో అక్షరాలా రూ. 2 లక్షలు విలువ చేసే నాణేలు దొరికాయి.
చెన్నై, ఒట్టేరి, సత్యవాణిముత్తు నగర్‌కు చెందిన రాజేశ్వరి (65), విజయలక్ష్మి (60), ప్రభావతి (57)లకు ఇల్లు ఉన్నా.. రోడ్డు పక్కనే నివసించేవారు. దీంతో పోలీసులు వారి ఇంటిని తనిఖీ చేశారు. ఆ ఇంట్లో లభ్యమైన ప్లాస్టిక్ బిందెల్లో నింపిన చిల్లర నాణేలు, ఏడు సవర్ల బంగారం, రూ. 40 వేలు విలువ చేసే రద్దయిన 500, 1000 రూపాయల పాత నోట్లు లభ్యమయ్యాయి. ఇవి చూసి ఇరుగుపొరుగువారు విస్తుపోయారు.
ఇదీ చదవండి: భర్తను చంపి ముక్కలుగా నరికి.. సంచిలో!