తమిళనాడు త్రిచి జిల్లాలో దొంగలు మరోమారు రెచ్చిపోయారు. అత్యంత నిఘా కలిగిన బీహెచ్ఈఎల్ క్యాంపస్‌లోని బ్యాంకుకే కన్నం వేశారు. తిరునెరుంబర్ నగరంలోని బీహెచ్ఈఎల్ ఆవరణలోని సహకార బ్యాంకు కిటికీ ఊసలు తొలగించి లోపలికి చొరబడ్డారు. సుమారు రూ.1.47 కోట్ల నగదు దోచుకెళ్లారు.
శుక్రవారం ఉదయం బ్యాంకు కిటికీ తెరిచి ఉండటాన్ని గమనించిన బీహెచ్ఈఎల్ భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బీహెచ్ఈఎల్లో పనిచేసే వెయ్యి మందికిపైగా ఉద్యోగుల జీతాలు ఈ బ్యాంకు ద్వారానే చెల్లిస్తారు.
గత నెలలో త్రిచి జిల్లాలోనే భారీ చోరీ జరిగింది. లలితా జ్యువెలరీలో చొరబడి సుమారు 13 కోట్ల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు దుండగులు.
ఇదీ చూడండి: గోడకు కన్నం వేసి.. లలితా జ్యువెలరీలో భారీ చోరీ!