కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా నోయిడాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వెన్నునొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. సోమవారం ఆసుపత్రిలో చేరిన వాద్రా... రాత్రి అక్కడే ఉన్నారు. ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు.
వెన్నునొప్పికి పరీక్షలు నిర్వహించి.. చికిత్స అనంతరం డిశ్చార్డ్ చేశారు వైద్యులు.
ప్రియాంక గాంధీ మంగళవారం ఉత్తర్ప్రదేశ్ రాయబరేలీకి మూడు రోజుల పర్యటనకై వెళ్లారు. అక్కడ కార్యకర్తలతో సమావేశంలో పాల్గొననున్నారు.
- ఇదీ చూడండి: జాతీయ నేతకు చెప్పుల దండ, గాడిదపై ఊరేగింపు!