కర్ణాటక బెంగళూరు పుత్తెనహళ్లి లోని మైకో లేఅవుట్లో ఓ దొంగల ముఠా హల్చల్ చేసింది. కార్లో వచ్చిన ముగ్గురు దుండగులు శ్రీహరి ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు. విలువైన వస్తువుల్ని కార్లోకి తరలించటం ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన పక్కింటి వ్యక్తి... ఇంటి యజమానికి సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న శ్రీహరి ప్రసాద్‌ను దుండగులు తుపాకీతో బెదిరించారు. రాళ్లతో ఆయనపై దాడి చేసి, కారులో పరారయ్యారు.
ఈ ఘటనలో శ్రీహరి ప్రసాద్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పుత్తెనహళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.