పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనలు బిహార్‌లో ఉద్ధృతమయ్యాయి. నేడు రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీ. బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చారు. దర్భంగాలోని రహదారిపై టైర్లకు నిప్పంటించి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు.
వైశాలిలో గేదెలతో రహదారిని దిగ్బంధించారు ఆర్జేడీ మద్దతుదారులు. దర్భంగాలోని రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలను నిలువరించారు. పౌరచట్టానికి వ్యతిరేకంగా ఆర్జేడీ పిలుపునిచ్చిన బంద్‌కు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు ఆ పార్టీనేత, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్.
పట్నాలో వీఐపీ పార్టీ కార్యకర్తలు.. బ్యారికేడ్లను దాటుకొని వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: శరణార్థులను ఆదుకోవడానికే 'పౌర' చట్టం: కిషన్‌రెడ్డి