ETV Bharat / bharat

'ప్రజాప్రతినిధుల కేసులపై హైకోర్టుల పర్యవేక్షణ అవసరం'

ప్రజాప్రతినిధులపై పెండింగ్​లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకు హైకోర్టులు సూక్ష్మ స్థాయిలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు అమికస్ క్యూరీ. గడిచిన రెండు సంవత్సరాలలో ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెరిగిపోయాయని తెలిపారు.

Rise in cases against sitting, ex-lawmakers; need strict monitoring, says report filed in SC
'ప్రజాప్రతినిధుల కేసులపై హైకోర్టుల పర్యవేక్షణ అవసరం'
author img

By

Published : Oct 5, 2020, 3:01 PM IST

గత రెండు సంవత్సరాలుగా ప్రస్తుత, మాజీ ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెరిగిపోయాయని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ విజయ్ అన్సారియా సమర్పించిన కార్యాచరణ నివేదిక పేర్కొంది. పెండింగ్​లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సూక్ష్మ స్థాయిలో హైకోర్టుల పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడింది.

ఈ నివేదిక ప్రకారం ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై 4,859 కేసులు పెండింగ్​లో ఉన్నాయి. 2020 మార్చిలో ఈ సంఖ్య 4,442గా ఉంది. ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల్లో యూపీ అగ్రభాగాన ఉండగా, బిహార్ రెండో స్థానంలో ఉంది.

విచారణ వేగానికి వీరిని నియమించండి

ప్రతి జిల్లాలో సెషన్స్​, మేజిస్ట్రేట్ స్థాయిల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని హైకోర్టులు స్వాగతించాయని అమికస్ క్యూరీ నివేదిక పేర్కొంది. జోన్లవారీగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని మరికొన్ని హైకోర్టులు సూచించాయని తెలిపింది. ప్రతి కోర్టుకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారి, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్​ను నియమించాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టులు లేఖలు రాశాయని వెల్లడించింది. కేసుల విచారణ వేగవంతానికి వీరంతా సహకరించాలని పేర్కొంది.

సాక్షుల విచారణకు ప్రత్యేక కోర్టులో భద్రమైన గది ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. ప్రతి కోర్టులో ఒక వీడియో కాన్ఫరెన్స్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఈ వ్యయాన్ని కేంద్రం భరించాలని పేర్కొంది.

విజయవాడలో 132 పెండింగ్ కేసులు

నివేదిక ప్రకారం విజయవాడలోని ప్రత్యేక కోర్టులో ప్రజాప్రతినిధులపై మొత్తం 132 కేసులు పెండింగ్​లో ఉన్నాయి. సెషన్స్ కోర్టులో 10, మేజిస్ట్రేట్ స్థాయి కోర్టులో 122 పెండింగ్ కేసులు ఉన్నాయి.

ప్రతి జిల్లాలో ఒక మేజిస్ట్రేట్ కోర్టును ప్రత్యేక కోర్టుగా గుర్తిస్తామని ఏపీ హైకోర్టు పేర్కొందని నివేదిక తెలిపింది. సెషన్స్ స్థాయి ప్రత్యేక కోర్టులను విశాఖ, కడపలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ప్రత్యేక కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ప్రాధాన్య క్రమంలో విచారించాలా లేదా సాధారణ విచారణా? అన్న అంశంపై ఏపీ హైకోర్టు స్పష్టత కోరింది.

తెలంగాణ హైకోర్టు ఆదర్శం

ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణలో ప్రజాప్రతినిధులపై మొత్తం 143 కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్​లోని ప్రత్యేక కోర్టుల్లో 118 కేసులు పెండింగ్​లో ఉండగా.. మరో 25 కేసులు సీబీఐ సహా ఇతర కోర్టుల్లో ఉన్నాయి. సీబీఐ ప్రధాన కోర్టులో ఉన్న 17 కేసులు 9 నెలల్లో ముగిసే దశలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటును తెలంగాణ హైకోర్టు ప్రతిపాదించిందని తెలిపింది. కేసుల విచారణ, పురోగతి కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుందని.. ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాల హైకోర్టులు కూడా తెలంగాణ హైకోర్టును ఆదర్శంగా తీసుకోవాలని అమికస్ క్యూరీ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.