ETV Bharat / bharat

కరోనాతో మున్ముందు మరిన్ని సవాళ్లు: జస్టిస్ రమణ - Reverse migration during pandemic will increase poverty, discrimination: SC Judge

కరోనా వల్ల భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్​డౌన్ కారణంగా ఏర్పడిన అతిపెద్ద సమస్య వలసల తిరోగమనమే​ అని పేర్కొన్నారు. వలస కార్మికులు తిరిగి స్వస్థలాలకు వెళ్లడం వల్ల పేదరికం, అసమానతలు పెరిగిపోతాయని అభిప్రాయపడ్డారు. లాక్​డౌన్ సమయంలో గృహ హింస తీవ్రమైందని... మహిళలు, చిన్నారులు, వృద్ధుల హక్కులకు విఘాతం కలిగిందని వ్యాఖ్యానించారు.

nv ramana
ఎన్​వీ రమణ
author img

By

Published : Jun 5, 2020, 5:36 AM IST

కరోనా కారణంగా మున్ముందు పెను సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి, జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. ఎవరూ ధైర్యం కోల్పోకుండా, నిబద్ధతతో వాటిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

పేదలకు వేగంగా న్యాయ సహాయం అందించడానికి సంబంధించిన విధానాలతో రూపొందించిన ప్రత్యేక హ్యాండ్‌బుక్‌ను ఆయన గురువారం విడుదల చేశారు. అనంతరం వెబినార్‌ ద్వారా రాష్ట్రాల న్యాయ సేవల ప్రాధికార సంస్థల ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్లు, సభ్య కార్యదర్శులు, హైకోర్టు న్యాయసేవల కమిటీల అధ్యక్షులు, జిల్లా న్యాయసేవల ప్రాధికార సంస్థల ఛైర్మన్లు, కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు.

"మూడు నెలలు గడిచినా పరిస్థితి ఇంకా నియంత్రణలోకి రాలేదు. కుటుంబాల్లో హింస పెరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. చిన్నారులపై లైంగిక వేధింపులు అధికమవుతుండటాన్నీ చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు మనల్ని ఆశ్రయించలేని పరిస్థితులు ఉంటే.. మనమే వారి వద్దకు వెళ్లి న్యాయం చేయాలి. ఇలాంటి సమస్యలను గుర్తించి మనం ఇప్పటికే వన్‌స్టాప్‌ సెంటర్లను ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో మహిళా న్యాయవాదుల ద్వారా టెలిఫోన్‌ సేవలు కొనసాగిస్తున్నాం. ఇకముందూ ఇదే ఒరవడిని కొనసాగించాలి"

- జస్టిస్ ఎన్​వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి

వివక్ష పెరిగే ముప్పు

భవిష్యత్తులో తలెత్తే సవాళ్లలో 'వలసల తిరోగమనం' ప్రధానమైనదని జస్టిస్‌ రమణ అన్నారు. "స్వస్థలాలకు భారీయెత్తున సాగుతున్న వలసలు పేదరికం, అసమానతలు, వివక్షను పెంచుతాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధుల హక్కులపైనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను కలిసికట్టుగా రూపొందించుకోవాలి. నేషనల్‌ లీగల్‌ హెల్ప్‌లైన్‌ నంబరు 15100 పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఆపదలో ఉన్నవారందరికీ లేదనకుండా న్యాయం చేయాలి" అని పేర్కొన్నారు.

కారాగారాల్లో రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా న్యాయ సేవల ప్రాధికార సంస్థల సాయంతో 58,797 మంది విచారణలో ఉన్న ఖైదీలు, 20,972 మంది శిక్ష పడ్డ ఖైదీలు పెరోల్‌పై విడుదలైన విషయాన్ని జస్టిస్‌ రమణ గుర్తుచేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.