మాజీ క్రికెటర్, భాజపా నేత గౌతమ్ గంభీర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తూర్పు దిల్లీ ఎన్నికల అధికారి కె.మహేష్ పోలీసులను ఆదేశించారు.
అనుమతి లేకుండా జంగ్పురలో బహిరంగ సభ ఏర్పాటు చేసినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
గత నెలలో పార్టీలో చేరిన గౌతమ్ గంభీర్‌కు తూర్పు దిల్లీ లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది భాజపా. ఈ నేపథ్యంలో ఆయన జగ్పురలో గురువారం ఓ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.