పాములు... మనిషి ప్రాణాలకు హానిచేస్తాయి. అలాంటి విష జంతువు మన కంటికి కనిపిస్తే... పరిగెడతాం. కాస్త ధైర్యముంటే... చంపాలని చూస్తాం. కానీ కర్ణాటకలోని నేలమంగళల సమీపంలో ఉన్న హేసరఘట్ట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ విషజంతువు గుడ్లపైనా జాలి చూపాడు.
పాములు పట్టడంలో నిష్ణాతుడైన లోకేష్‌కు రెండు నెలల క్రితం ఓ నిర్మానుష్య ప్రాంతంలో కొన్ని పాము గుడ్లు కనిపించాయి. అక్కడే అలాగే ఉంచితే వాటికి హాని కలుగుతుందేమోనని భావించి ఇంటికి తెచ్చాడు. ఓ పెట్టెలో ఇసుక నింపి గుడ్లను పొదిగించాడు. రెండు నెలల పాటు సురక్షితంగా ఉండేలా చూసి చిన్ని పాములకు ప్రాణాలు పోశాడు.
ఇప్పటి వరకు 16 పిల్లలు సురక్షితంగా గుడ్ల నుంచి బయటపడ్డాయి. ఎగిరిపడుతున్న బుల్లి పాము పిల్లలను చూసేందుకు చుట్టుపక్కల నివసించేవారు ఉత్సాహంగా వస్తున్నారు.
అటవీ అధికారుల సాయంతో ఈ పాము పిల్లలను దగ్గర్లోని అడవిలో వదలేందుకు లోకేష్ సన్నాహాలు చేస్తున్నాడు.
ఇదీ చూడండి : రుతుపవనాలు 5 రోజులు ఆలస్యం: ఐఎండీ