కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పందించింది. జైట్లీ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందన్న కథనాలు నిరాధారమైనవని తెలిపింది. ఇలాంటి విషయాల్లో మీడియా సంయమనం పాటించాలని కోరింది. జైట్లీ ఆరోగ్యంపై ఇటీవల వస్తోన్న ఊహాగానాలపై ప్రభుత్వ అధికార ప్రతినిధి సితాన్షుకర్ ట్విటర్‌లో వివరణ ఇచ్చారు.
"అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో వస్తోన్న వార్తలు అవాస్తవం. నిరాధారమైనవి. ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేసే ముందు స్పష్టత తీసుకోవాల్సిన అవసరముంది."
- సితాన్షుకర్, ప్రభుత్వ అధికార ప్రతినిధి
జైట్లీ స్నేహితుడు, మీడియా దిగ్గజం రజత్ శర్మ కూడా ఈ వార్తలను ఖండించారు.
"జైట్లీ ఆరోగ్యంపై అందరూ చర్చిస్తున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా మాట్లాడుతున్నారు. నిన్న సాయంత్రమే జైట్లీని కలిశాను. ఆయన కోలుకుంటున్నారు. అంతేకాకుండా ఇంటివద్దనే పనిచేస్తున్నారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం కారణంగా బయటికి వెళ్లవద్దని మేం కోరాం. అందుకు ఆయన అంగీకరించటం సంతోషం."
-రజత్ శర్మ, జైట్లీ మిత్రుడు
జైట్లీని ఆదివారం కలిశానని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. జైట్లీ త్వరగా కోలుకోవాలని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఆకాంక్షించారు.
-
Had a courtesy meeting with Hon’ble Union Minister @arunjaitley this evening. pic.twitter.com/Kmq7qkBaCA
— Shaktikanta Das (@DasShaktikanta) May 26, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Had a courtesy meeting with Hon’ble Union Minister @arunjaitley this evening. pic.twitter.com/Kmq7qkBaCA
— Shaktikanta Das (@DasShaktikanta) May 26, 2019Had a courtesy meeting with Hon’ble Union Minister @arunjaitley this evening. pic.twitter.com/Kmq7qkBaCA
— Shaktikanta Das (@DasShaktikanta) May 26, 2019
జైట్లీ ఆరోగ్యంపై ఇటీవల రకరకాల వార్తలు వచ్చాయి. ఎయిమ్స్ నుంచి విడుదలైన ఆయన.. చికిత్స కోసం యూకే లేదా అమెరికా వెళ్తారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయన్ను కలిసేందుకు కొందరు ప్రయత్నించగా అనారోగ్య కారణంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని జైట్లీ కార్యాలయం స్పష్టం చేసింది. భాజపా విజయోత్సవాల్లోనూ అరుణ్ జైట్లీ పాల్గొనలేదు. ఫలితంగా మరోసారి ఆర్థిక మంత్రిగా కొనసాగే అవకాశం లేదని మీడియా ప్రచురించింది.
ఇదీ చూడండి: 'క్షీణించిన జైట్లీ ఆరోగ్యం.. చికిత్స కోసం విదేశాలకు!'