నిషేధానికి గురైన టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా.. అదే ఫీచర్లతో సరికొత్త యాప్‌ను రూపొందించాడు కేరళ తిరువనంతపురానికి చెందిన ఐటీ విద్యార్థి. 'టిక్ టిక్ మేడ్ ఇన్ ఇండియా' పేరుతో అభివృద్ధి చేసిన ఈ యాప్‌కు ఇప్పడు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ఇందులో.. వీడియోలు అప్లోడ్, ఎడిటింగ్, ప్లే చేయటం సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
టిక్‌టాక్ యాప్‌ను నిషేధించిన నేపథ్యంలో.. దాని యూజర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే యాప్ పనులు ప్రారంభించాడు కేరళ కార్యవట్టమ్ ఇంజినీరింగ్ విశ్వవిద్యాలయంలో ఇన్ఫర్మేషన్ టెక్నోలజీ(ఐటీ) మూడో ఏడాది చదువుతున్న ఆశీష్ సజన్. పలు సంస్థలతో పని చేస్తూ.. టిక్ టిక్ పేరిట యాప్‌ను ఆవిష్కరించాడు.
కొద్ది రోజుల్లోనే టిక్ టిక్కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. పెద్ద ఎత్తున డౌన్లోడ్స్ పెరిగాయి. ఈ క్రమంలో యాప్‌ను దేశ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నాడు. ఇందుకోసం ఆహర్నిశలు కష్టపడతున్నట్లు చెప్పాడు ఆశీష్. ప్రస్తుతం ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నానని, పెట్టుబడులు పెంచుతున్నామని తెలిపాడు.
టిక్ టాక్‌లో 7లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్న ఆశీష్ సోదరి ఆర్దా.. ప్రస్తుతం టిక్ టిక్లో తన వీడియోలు పోస్ట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటోంది.
ఇదీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జూ పార్క్ విశేషాలివే