ETV Bharat / bharat

జియో టవర్ల ధ్వంసంపై కేంద్రానికి నోటీసులు - రిలయన్స్ టవర్ల విధ్వంసం

రిలయన్స్ టవర్ల ధ్వంసంపై ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన పంజాబ్ హరియాణా హైకోర్టు.. కేంద్రానికి, పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. టవర్ల ధ్వంసాన్ని ఆపాలంటూ రిలయన్స్ సోమవారం కోర్టును ఆశ్రయించింది.

Reliance towers vandalism case: HC gives notice to centre and Punjab govt
టవర్ల ధ్వంసంపై కేంద్రానికి నోటీసులు
author img

By

Published : Jan 5, 2021, 1:27 PM IST

టవర్ల విధ్వంసంపై రిలయన్స్ దాఖలు చేసిన పిటిషన్​ను పంజాబ్-హరియాణా హైకోర్టు విచారించింది. కేంద్రం సహా పంజాబ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యంపై స్పందించాలని ఆదేశించింది.

చట్టవిరుద్ధంగా టవర్ల ధ్వంసానికి పాల్పడుతున్నారని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ హైకోర్టులో సోమవారం పిటిషన్ వేసింది. ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని వీటికి అడ్డుకట్ట వేసేలా ఆదేశించాలని కోరింది.

వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు మేలు చేస్తాయన్న ఆరోపణలతో రిలయన్స్​ టవర్లపై దాడులకు పాల్పడుతున్నారన్న వార్తలపై సంస్థ స్పందించింది. రైతుల నుంచి నేరుగా ఎలాంటి ఉత్పత్తులు తమ సంస్థ కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ వ్యవసాయం చేయడం లేదని తేల్చిచెప్పింది.

ఇవీ చదవండి:

'జియో టవర్లు ధ్వంసమైతే మాకేంటి సంబంధం'

పంజాబ్​లో కొనసాగుతున్న 'టవర్ల' విధ్వంసం..

'టవర్ల విధ్వంసం'పై రైతులకు సీఎం వార్నింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.