ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూకు చెందిన ఓ వైద్యుడు ఇటీవలే వైరస్‌ను జయించారు. తాజాగా ప్లాస్మా థెరపీ కోసం తన ప్లాస్మాను దానం చేయడానికి ముందుకుచ్చారు.
'వెంటనే ఒప్పుకున్నా..'
లఖ్‌నవూలోని కింగ్ జార్జియా వైద్య విశ్వవిద్యాలయం(కేజీఎమ్యూ)లో వైద్యుడిగా పనిచేస్తున్న తౌసీఫ్కు మార్చి 17న వైరస్ పాజిటివ్‌గా తేలింది. కరోనాను జయించి ఈ నెల 7న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. 14 రోజుల క్వారంటైన్ అనంతరం తిరిగి విధుల్లో చేరారు.
"ప్లాస్మా థెరపీ కోసం వైద్యులు నన్ను సంప్రదించారు. కేజీఎమ్యూ నుంచి ప్లాస్మా దానం చేసే తొలి వ్యక్తిగా నేను ఉంటానని, అందుకు నా అంగీకారం అడిగారు. నేను వెంటనే ఒప్పుకున్నా. పవిత్ర రంజాన్ మాసంలో రోగులను రక్షించడం కన్నా గొప్ప విషయం ఇంకేదీ ఉండదు."
--- తౌసీఫ్ ఖాన్, వైద్యుడు.
శనివారం వైద్యులు తౌసీఫ్ శరీరం నుంచి దాదాపు 500 మిల్లిలీటర్ల ప్లాస్మాను సేకరించారు. ఇందుకోసం గంటన్నర సమయం పట్టిందని వైద్యులు వెల్లడించారు.
"తౌసీఫ్ ఖాన్ ప్లాస్మాలోని యాంటీబాడీల పనితీరు మెరుగ్గా ఉంది. 200 మిల్లిలీటర్ల ప్లాస్మాతో ఇద్దరికి చికిత్స అందించవచ్చు. అప్పటికీ ఫలితం లేకపోతే మరో 200 మిల్లిలీటర్ల ప్లాస్మా అందిస్తాం. "
--- తూలికా చంద్రా, కేజీఎమ్యూ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ హెడ్
ప్లాస్మా థెరపీ అంటే?
వైరస్ రోగులకు అందించే ప్రయోగాత్మక చికిత్స ప్లాస్మా థరెపీ. కరోనా సోకి.. కోలుకున్న వారి నుంచి బ్లడ్ ప్లాస్మా సేకరిస్తారు. దాన్ని.. పరిస్థితి విషమంగా ఉన్న రోగులకు అందిస్తారు. వైరస్‌ను జయించిన వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వారి రక్తాన్ని బాధితులకు అందిస్తే.. అందులోని యాంటీబాడీలు వైరస్‌పై పోరుకు సహకరించే అవకాశముందన్నది వైద్యులు మాట.
ఉత్తరప్రదేశ్‌తో పాటు కేరళ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు ఈ ప్లాస్మా థెరపీని రోగులపై ప్రయోగిస్తున్నాయి.
ఇదీ చూడండి:- దేశంలో వైరస్‌కు 'కొత్త రూపం'- వైద్యుల ఆందోళన