ETV Bharat / bharat

రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- రోజుకు 10 లక్షల దిశగా

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 9.18 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. మొత్తంగా ఇప్పటివరకు 3.26 కోట్ల నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. పాజిటివిటీ రేటు 8 శాతంకన్నా తక్కువకు పడిపోయినట్లు వెల్లడించింది. మరోవైపు రికవరీల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ రేటు 73.91 శాతానికి చేరింది.

Record 9.18 lakh COVID tests done in a day, cumulative tests reach 3.26 cr
రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు-రోజుకు 10 లక్షల దిశగా
author img

By

Published : Aug 20, 2020, 6:28 PM IST

కరోనా పరీక్షల నిర్వహణలో భారత్​ రోజురోజుకు గణనీయంగా మెరుగవుతోంది. రోజుకు 10 లక్షల టెస్టులు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. బుధవారం రికార్డు స్థాయిలో 9,18,470 పరీక్షలను నిర్వహించింది. మొత్తంగా 3.26 కోట్ల నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 8 శాతం కన్నా తక్కువకు పడిపోయిందని తెలిపింది.

"పరీక్షల సంఖ్య పెంచడం వల్ల మొదట పాజిటివిటీ రేటు పెరుగుతుంది. అయితే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అనుభవాలను బట్టి చూస్తే సరైన ఐసోలేషన్, క్లినికల్ మేనేజ్​మెంట్, కేసుల ట్రాకింగ్ వంటివి పటిష్ఠంగా చేపడితే పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతుందని అర్థమవుతోంది."

-కేంద్ర వైద్య శాఖ

మొత్తం ల్యాబ్​లు

డయాగ్నోస్టిక్ ల్యాబ్ నెట్​వర్క్​ను విస్తృతం చేయడం సహా పరీక్షల వేగవంతానికి తీసుకున్న చర్యల ఫలితంగా ఈ ఘనత సాధించగలిగినట్లు వైద్య శాఖ తెలిపింది. 977 ప్రభుత్వ ల్యాబ్​లు, 517 ప్రైవేటు ల్యాబ్​లతో మొత్తం 1,494 ల్యాబ్​లు టెస్టింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఫలితంగా 10 లక్షల మంది జనాభాకు 23,668 పరీక్షలు(టీపీఎం) చేస్తున్నట్లు పేర్కొంది. 26 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు దేశ సగటు(8 శాతం) కన్నా తక్కువ ఉన్నట్లు వెల్లడించింది.

రికవరీలు

మరోవైపు రికవరీల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20,96,664 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 73.91 శాతానికి చేరింది. ప్రస్తుతం 6,86,395 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య శాఖ తెలిపింది. ఇందులో 0.28 శాతం మంది బాధితులు వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. మరో 1.92 శాతం మంది ఐసీయూల్లో, 2.62 శాతం మంది ఆక్సిజన్ సహకారంతో చికిత్స పొందుతున్నారని స్పష్టం చేసింది.

మరణాల రేటు మరింత క్షీణించి 1.90కి చేరినట్లు వైద్య శాఖ వెల్లడించింది. కరోనా కట్టడికి ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలను కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల ఇది సాధ్యమైందని పేర్కొంది. విస్తృతంగా పరీక్షలు నిర్వహించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టడం సహా కరోనా సోకిన బాధితులకు సరైన చికిత్స అందించడం వల్ల మరణాల రేటు ప్రపంచ సగటుకన్నా తక్కువగా ఉందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: కేంద్ర జల్​ శక్తి మంత్రికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.