ETV Bharat / bharat

ప్రాణభయంతో రెబల్​ ఎమ్మెల్యేల ఫిర్యాదు - కూటమి

కర్ణాటక కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో రాజీనామా చేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు తాజాగా ముంబయి పోలీస్​ కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. నేడు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ముంబయి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో తమకు ప్రాణహాని ఉందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కర్ణాటకీయం: ప్రాణభయంతో రెబల్​ ఎమ్మెల్యేల ఫిర్యాదు
author img

By

Published : Jul 10, 2019, 6:43 AM IST

Updated : Jul 10, 2019, 7:16 AM IST

కర్ణాటక రాజకీయం మలుపులు తిరుగుతూనే ఉంది. సంకీర్ణ ప్రభుత్వంపై అసంతృప్తితో రాజీనామా చేసి ముంబయిలో ఉంటున్న ఎమ్మెల్యేల్లో 10 మంది తమకు ప్రాణహాని ఉందని తాజాగా ముంబయి పోలీస్​ కమిషనర్​కు ఫిర్యాదు చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి, కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​ నేడు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో చర్చించడానికి ముంబయి వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు ప్రాణహాని ఉందని 10 మంది శాసనసభ్యులు కమిషనర్​కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా తమకు కుమారస్వామి, శివకుమార్​ను కలవడం ఎంతమాత్రం ఇష్టం లేదని ఎమ్మెల్యేలు తెలిపారు. వారిద్దరినీ తాము ఉంటోన్న హోటల్​లోకి అనుమతించరాదని పోలీసులను కోరారు. ఆ లేఖ ప్రతులను స్థానిక పోలీస్​ స్టేషన్​కు, వారుంటున్న హోటల్​ యాజమాన్యానికి అందజేశారు.

ఈ విషయంపై వెంటనే స్పందించిన ముంబయి పోలీసు శాఖ.. రెబల్​ ఎమ్మెల్యేలు ఉంటున్న హోటల్​ చుట్టూ రాష్ట్ర రిజర్వు పోలీసు దళాన్ని మోహరించింది.

Geneva, Switzerland, JULY 09, 2019: Political activists from Pakistan occupied Kashmir (PoK), who are living in Europe and UK organised a protest against Pakistan's occupation and subjugation during the 41st session of UN Human Rights Council Session in Geneva. They chanted anti-Pakistan slogans and sought freedom from the oppressive clutches of Pakistan. From exploitation of resources to the rapidly expanding terror camps, the activists highlighted a large number of plights being endured by the people of PoK and Gilgit Baltistan in their daily lives. Activists also underscored the poor state of judiciary which has become highly biased in its judgment owing to a rise in the interference of security agencies in their affairs.
Last Updated : Jul 10, 2019, 7:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.