కర్ణాటక కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అనర్హత వేటును సవాలు చేస్తూ తాము వేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. ఈనెల 19న వాదనలు వినాలని అభ్యర్థించారు.
జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఎమ్మెల్యేల పిటిషన్‌ను పరిశీలించింది. అత్యవసర విచారణ చేపట్టేందుకు మెమోను రిజిస్ట్రార్‌కు అందించాలని ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీని ఆదేశించింది.
జులై 29న కర్ణాటక విధాన సభలో జరిగిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి సర్కారు పడిపోయి.. భాజపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్.
ఇదీ చూడండి: మరో 25 ఏళ్లకు కశ్మీర్ రహిత భారత్: వైగో