బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) ప్రస్తుతం తక్షణ దిద్దుబాటు చర్య ( ప్రాంప్ట్ కరెక్టివ్ ఆక్షన్) నుంచి మినహాయింపు పొందాయి. ఈ చర్యతో రుణ వితరణ సామర్థ్యం పెరిగి, ఆర్థిక పురోగమనానికి ఉపయోగపడనుంది.
" మూలధన పరిరక్షణ, నికర నిరర్ధక ఆస్తులు 6 శాతం కన్నా తక్కువ ఉన్న నేపథ్యంలో నిబంధనలకు లోబడి ఉన్నందున బీఓఐ, బీఓఎం బ్యాంకుల పీసీఏ నుంచి మినహాయించాం. ఓబీసీ విషయంలో ప్రభుత్వం తగినంత మూలధనాన్ని సమకూర్చగా నిరర్ధక ఆస్తులు 6 శాతం కన్నా తక్కువగా నమోదయ్యాయి. దాంతో ఓబీసీకి సైతం మినహాయింపునిచ్చాం. వివిధ ప్రమాణాల ప్రకారం ఈ బ్యాంకుల పనితీరును ఆర్బీఐ నిరంతరం పర్యవేక్షిస్తుంది. "- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పీసీఏ కింది ఎనిమిది బ్యాంకులు
అలహాబాద్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పోరేషన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేనా బ్యాంక్లు ఇప్పటికీ తక్షణ దిద్దుబాటు చర్య (పీసీఏ) కింద ఉన్నాయి. దాంతో రుణ వితరణపై నియంత్రణ, రుణాల విస్తరణపై నిషేధం అమలులో ఉంటుంది.