రిపబ్లిక్ ఛానల్ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి, బార్క్ మాజీ సీఈఓ పార్థో దాస్ గుప్తా మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌పై నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్(ఎన్బీఏ) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇతర ఛానళ్ల రేటింగ్లను మోసపూరితంగా తగ్గించి.. రిపబ్లిక్ ఛానల్‌కు నెలవారీగా వీక్షకులను పెంచేందుకు వీరిద్దరూ కుట్ర పన్నినట్లు ఈ సంభాషణలో స్పష్టంగా వెల్లడైందని తెలిపింది ఎన్బీఏ.
ఈ వాట్సాప్ సందేశాలు కేవలం టీఆర్పీ తారుమారునే కాకుండా.. అధికార బలాన్ని తెలుపుతున్నాయని పేర్కొంది. ఈ సంభాషణ గత నాలుగేళ్లుగా టీఆర్పీ అవకతవకలపై తాము చేస్తున్న ఆరోపణలను ధ్రువీకరిస్తోందని ఎన్బీఏ వ్యాఖ్యానించింది. భారత బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్(ఐబీఎఫ్)లో రిపబ్లిక్ టీవీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎన్బీఏ డిమాండ్ చేసింది. ఈ మేరకు బార్క్ ముందు పలు డిమాండ్లను ఉంచిన ఎన్బీఏ తప్పుడు రేటింగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. తీసుకున్న చర్యలను తమతో పంచుకునేంత వరకు ఛానళ్ల రేటింగ్లను నిలుపుదల చేయాలని బార్క్‌కు.. ఎన్బీఏ విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: వాట్సాప్ బదులు వేరే యాప్ వాడండి: హైకోర్టు