ETV Bharat / bharat

వ్రతం చెడ్డా దక్కని ఫలం..!

మహా మలుపులు.. గత కొన్ని రోజులుగా అన్ని చోట్లా వినిపిస్తున్న పదం. ఒకదాని తర్వాత మరొకటి... ఎవ్వరూ ఊహించని రీతిలో అనూహ్య మలుపులు వరసగా జరుగుతూనే ఉన్నాయి. పూటకో మలుపు, రోజుకో నిర్ణయం... రాత్రి చూసిన విషయం తెల్లారికల్లా మారిపోతోంది. ఇన్నాళ్లూ దుమ్మెత్తుకున్న పార్టీలు కూటమి కడుతుంటే.. కలిసి పోటీ చేసిన పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. ఊహలకందని రీతిలో సాగిన ఈ నాటకీయ పరిణామాలు... ప్రజలందరిలో ఉత్కంఠ రేపాయి.

మహా మలుపులు
వ్రతం చెడ్డా దక్కని ఫలం
author img

By

Published : Nov 27, 2019, 6:52 AM IST

కౌటిల్యుడికే కొత్త కిటుకులు నేర్పగల రసవత్తర రాజకీయ కళాకౌశల ప్రదర్శన మహారాష్ట్ర వేదికపై మహా రంజుగా సాగిపోయింది. రాజకీయాల్లో, క్రికెట్లో కడనిమిషం దాకా గెలుపెవరిదో చెప్పలేమన్న నితిన్‌ గడ్కరీ వ్యాఖ్యలు ఎంత నిజమో- పూర్తిగా కొలువుతీరకుండానే పట్టుమని నాలుగు రోజుల్లో కుప్పకూలిన ఫడణవీస్‌ ప్రభుత్వం ప్రత్యక్షంగా రుజువు చేసింది. మహా వికాస్‌ అఘాడి (ఎంవీఏ) పేరిట త్రిపక్ష కూటమి కట్టిన శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఉద్ధవ్‌ ఠాక్రేను తమ నేతగా ఎన్నుకొని, కనీస ఉమ్మడి కార్యక్రమానికి తుది మెరుగులు దిద్దుతున్న దశలో- 22వ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి మర్నాటి ఉదయం ఎనిమిది గంటల్లోపు మరాఠా రాజకీయం దిగ్భ్రాంతకర మలుపులు తిరిగింది. 54 మంది సభ్యులుగల ఎన్‌సీపీ శాసనసభాపక్ష నేత అజిత్‌ పవార్‌ను గుట్టుగా ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’తో ఆకట్టుకున్న కమలం పార్టీ- రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు సిఫార్సు, ఆమోదం, గవర్నర్‌ పిలుపు, ప్రమాణ స్వీకార తతంగం అంతటినీ యుద్ధప్రాతిపదికన కానిచ్చేసింది.

అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ఫడణవీస్‌ పునరధికారానికి రాగలిగినా- వద్దకు చేరి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టే స్థాయిలో ఎన్‌సీపీలో చీలిక రాకపోవడం, నేటి సాయంత్రం అయిదు గంటల్లోపు బలపరీక్ష పూర్తి కావాలని ‘సుప్రీం’ న్యాయపాలిక ఆదేశించడంతో కాడీ మేడీ పడేయడం తప్ప కమలనాథులకు గత్యంతరం లేకపోయింది. ఎమ్మెల్యేల బేరసారాలవంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు చాపచుట్టి, సుస్థిర ప్రభుత్వానికి ప్రోది చేయడంద్వారా అనిశ్చితికి తెర దించాలన్న జస్టిస్‌ ఎన్‌వీ రమణ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో- అజిత్‌ పవార్‌ రాజీనామా చేసి నిష్క్రమించడం భాజపాకు శరాఘాతమైంది. ఎంవీఏ సర్కారు ఏర్పాటుకు వడివడిగా రంగం సిద్ధమవుతుంటే- సైద్ధాంతిక సారూప్యం లేని త్రిపక్ష కూటమి ఏ మేరకు సుస్థిర పాలన అందించగలదన్న సందేహాలు ముప్పిరిగొంటున్నాయి!

అనుకున్నది ఒక్కడి అయినది ఒక్కటి

ఎదిరి పక్షాల్లో చీలికలే పదవీ పీఠానికి నిచ్చెనమెట్లు అవుతాయంటే, అలాంటి అధికారం తనకు అక్కర్లేదని పదమూన్నాళ్ల ప్రధానిగా 1996లో వాజపేయీ సమున్నతాదర్శానికి గొడుగు పట్టారు. అధికారం కైవసం చేసుకొనే క్రమంలో ఏ అడ్డదారైనా దొడ్డదారేనని తీర్మానించేసుకొన్న సమకాలీన రాజకీయాల్లో ఆ తరహా సైద్ధాంతిక విలువలు- అక్షరాలా చెల్లని కాసులు! అక్టోబరు 21 నాటి మహారాష్ట్ర ఎన్నికల్లో 25.7 శాతం ఓట్లు, 105 సీట్లతో ఏకైక పెద్దపార్టీగా ఆవిర్భవించిన భాజపాతో పాలక కూటమి భాగస్వామిగా పోటీ చేసిన శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. సాధారణ మెజారిటీ కంటే అధికంగా సీట్లు గెలుచుకొన్న ఆ పాలక కూటమిలో- ముఖ్యమంత్రి పీఠం సహా చెరిసగం పదవీపంకాలు కావాలంటూ శివసేన పెట్టిన పేచీ రాజకీయ అనిశ్చితికి, రాష్ట్రపతి పాలనకు దారితీసింది. ముఖ్యమంత్రి పదవికోసం అర్రులు చాస్తున్న శివసేన- ఎన్‌సీపీ ద్వారా కాంగ్రెస్‌ మద్దతు సాధనకూ చేసిన యత్నాలు ఫలిస్తుండటం కమలం పార్టీని గంగవెర్రులు ఎత్తించింది.

ఎన్‌సీపీ అంటే న్యాచురల్లీ కరప్ట్‌ పార్టీ (సహజంగానే అవినీతి పార్టీ) అని ఎకసెక్కాలాడిన భాజపా- అవసరార్థం అజిత్‌ పవార్‌తో అంటకాగడానికి సిద్ధపడి ఉపముఖ్యమంత్రిత్వమూ కట్టబెట్టింది. గోవానుంచి మణిపూర్‌ దాకా పలు రాష్ట్రాల్లో తాను చేసిన రాజకీయాన్నే విపక్షాలు నిష్ఠగా అనుసరిస్తుంటే, అనైతిక పొత్తులంటూ భాజపా ఈసడిస్తోంది. ‘నువ్వు ఒకందుకు పోస్తే, నేను ఒకందుకు తాగానన్నట్లు’గా అజిత్‌ పవార్‌ రాకపోకలు- అందరూ ఆ తాను ముక్కలేనన్న సత్యాన్ని ఎలుగెత్తుతున్నాయి. సైద్ధాంతిక నిబద్ధతగల క్యాడర్లు, లీడర్ల పార్టీగా భాజపాకు ఉన్న విలక్షణతను చేజేతులా చెరిపేసుకొంటూ నిరుడు కర్ణాటకలో, ఇప్పుడు మహారాష్ట్రలో అధికారంకోసం ఉరకలెత్తి కమలనాథులు ఇదమిత్థంగా బావుకొన్నదేమిటి?

పగవాణ్ని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం అన్నట్లు- వేర్వేరు దిశలకు ప్రయాణించే మూడు చక్రాల ఎంవీఏ ఆటో తిరగబడక తప్పదని ఫడణవీస్‌ జోస్యం చెబుతున్నారు. ఆ సైద్ధాంతిక రచ్చను, పాలన వ్యవహారాల్లో రాజకీయ రొచ్చును మహారాష్ట్ర ప్రజలు తెలుసుకొనేదాకా కమలనాథులు ఎందుకు ఆగలేకపోయారు? మెజారిటీ కోసం ఎమ్మెల్యేలకు వల వేయరాదన్నదే మొదటినుంచీ తమ అభిమతమని ఫడణవీస్‌ చెబుతున్నా- తమ పక్షాన ఆ పనిని అజిత్‌ పవార్‌కు పురమాయించిందెవరు? పోటీచేసిన స్థానాల్లో 70 శాతం గెలుపు, ప్రజల మద్దతు తమకే ఉందని నిర్ధారిస్తోందన్న మాటా తర్కానికి నిలిచేది కాదు.

నిరుటి కర్ణాటక ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి కొద్ది సీట్లే తరుగుపడిన కమలం పార్టీ ఏకైక పెద్ద రాజకీయ పక్షంగా అవతరించి అదే తరహా వాదనతో గవర్నర్‌ ఆహ్వానాన్ని అందుకొని యెడియూరప్ప సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు కూడా, విశ్వాస పరీక్ష సత్వరం జరగాలన్న సుప్రీం ఆదేశాలతో బేరసారాలకు దారులు మూసుకుపోయి బలపరీక్షకు నిలబడకుండానే యెడియూరప్ప నిష్క్రమించాల్సి వచ్చింది. దరిమిలా కొలువుతీరిన జేడీ(ఎస్‌) కాంగ్రెస్‌ సంకీర్ణానికి కమలనాథులు అసమ్మతి ఉరితాళ్లు ఎలా పేనిందీ ఇటీవలి చరిత్రే! కర్ణాటకంనుంచి సరైన గుణపాఠం నేర్చుకొని ఉంటే మహారాష్ట్రలో త్రిపక్ష కూటమి తమాషాను జనం కళ్లకు కట్టి, తన ఏలుబడి భిన్నత్వాన్ని సగర్వంగా ఆవిష్కరించే అవకాశం భాజపాకు దక్కేదే. శీలహీన రాజకీయాలకూ తనదైన ఒరవడి దిద్దే క్రమంలో భాజపా అంతిమంగా సాధించిందేమిటి? వ్రతం చెడ్డా ఫలం దక్కని నిస్పృహ మాత్రమే మిగిలింది!

ఇదీ చూడండి : ఐదేళ్లలో 'పెట్రోల్​ బంక్'​లు సెంచరీ కొడితేనే..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Stadium Pierre Mauroy, Lille, France. 26th November, 2019.
1. 00:00 LOSC coach Christophe Galtier arrives at press conference
2. 00:08 Wide of press room
3. 00:15 SOUNDBITE (French): Christophe Galtier, coach Lille LOSC:
"It's a Champions League game. It's a privilege to prepare a Champions League game, whatever our group position and our points. It's a Champions League game that we play at home in front of our supporters. Every coach, every player dreams to play these kind of games. The advantage is that there is no pressure to get a result. We will play against one of the best teams in Europe. The first game we played against them (Ajax) was difficult, but we had a lot of chances to score. It didn't happen, but the Champions League is the most beautiful competition for a club, for the supporters, for the players. We must play this game with a lot of determination and to play it without any pressure. We want to live an intense game of the Champions League."
SOURCE: SNTV
DURATION: 01:42
STORYLINE:
Lille trained on Tuesday ahead of their UEFA Champions League Group H game against Ajax Amsterdam.
With only one point after four games, the French side can no longer qualify for the next round of the Champions League. They sit bottom of their group, six points behind trio Chelsea - Valencia and Ajax, and a third place finish even looks like a difficult task.  
Christophe Galtier's side has no major injury worries ahead of the European encounter, except for long-time absentee Timothy Weah.
Lille are currently 10th in Ligue 1, five points away from the top 3. They lost to PSG at the weekend (2-0) and have only recorded one win in their last 10 games in all competitions (5 defeats, 4 draws).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.