ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స చేసి అతడి ప్రాణాలను కాపాడారు కర్ణాటక మంగళూరులోని ఇండియానా ఆసుపత్రికి చెందిన వైద్యులు. శస్త్రచికిత్సలో భాగంగా అతడి భుజాన్ని తొలగించారు.
బాలుడు గత కొంతకాలంగా ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. క్యాన్సర్ వల్ల భుజం భాగంలో వాపు రావటం వల్ల ..రాత్రి సమయంలో అతడికి విపరీతమైన నొప్పి వచ్చేది. క్రమంగా అతడి చేతి భాగము పూర్తిగా పని చేయకుండా పోయింది.
తొలుత ఆ బాలుడికి 10 వారాల పాటు కీమోథెరఫీ చికిత్సను అందించారు ఇండియానా ఆస్పత్రి వైద్యులు. అయితే ఎటువంటి మార్పు లేకపోయే సరికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. దాదాపు 10 గంటల పాటు శ్రమించి ఆ బాలుడి భుజాన్ని పూర్తిగా తొలగించారు.
వాపు ఉన్న భాగంలో కణితిని నాశనం చేయటానికి మైనస్ 194 డిగ్రీల సెల్సియస్‌తో కూడిన నైటోజన్ ద్రావణాన్ని పంపించి దాన్ని గడ్డ కట్టించారు. అనంతరం కణాలను నాశనం చేశారు. శస్త్ర చికిత్స అనంతరం బాలుడు కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.
" ఈ విజయంతో ఎముకలు, కణజాల కణితితో బాధపడే వారికి శస్త్రచికిత్స చేసే కేంద్రంగా మంగళూరు మారుతుంది."
-యూసఫ్ కుంబ్లే, ఇండియానా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్