ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని గంగోత్రి జాతీయ ఉద్యానవనంలో అరుదైన 'మంచు చిరుత' జంట సంచరించింది. పిల్లి జాతికి చెందిన ఈ పులులు మధ్య, దక్షిణాసియాలో 3000 నుంచి 4000 మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య 10 వేల కంటే తక్కువే. అరుదైన ఈ జాతి చిరుతలను అంతరించిపోయే జీవుల జాబితాలో చేర్చింది అంతర్జాతీయ సహజవనరుల పరిరక్షణ సమాఖ్య.
![Rare Snow Leopards Spotted In Uttarkashi's Gangotri National Park](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8885298_snow-leapord.jpg)
వీటి కోసం భారతదేశంలో మొట్టమొదటి మంచు చిరుత సంరక్షణ కేంద్రం ఉత్తరకాశీ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇక్కడ అంతరించిపోతున్న ఇతర వన్యప్రాణులు వూలీ ఫ్లయింగ్ స్క్విరల్, యురేషియన్ లింక్స్ (అడవి పిల్లులు), అడవి కుక్కలు ఉంటాయి.