ఉత్రరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ ఓటర్లకు బైక్ ట్యాక్సి సంస్థ 'ర్యాపిడో' వినూత్న ఆఫర్ ప్రకటించింది. నేడు జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేవారు తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఉచితంగా బైక్ సేవలను అందిస్తున్నట్లు వెల్లడించింది.
ర్యాపిడో మొబైల్ యాప్ ద్వారా బైక్ బుక్ చేసుకునేటప్పుడు "ఐ ఓట్" అనే కూపన్‌తో ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని సూచించింది.
ప్రతీ ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకే ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు 'ర్యాపిడో ' సంస్థ తెలిపింది. లఖ్‌నవూలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు వర్తిస్తుంది.
ఐదోదశ ఎన్నికల్లో భాగంగా లఖ్‌నవూలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది.
ఇదీ చదవండి:ఈ నెల 23 నుంచి దేశంలో యూపీఏ సర్కార్: పైలట్