మహారాష్ట్రలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన ఓ మైనర్‌కు రూ. 10 వేల జరిమానా విధించింది జువైనల్ కోర్టు. అంతేకాకుండా అతడ్ని సంఘసేవ చేయాల్సిందిగా ఆదేశించింది.
అసలేం జరిగింది...
భివండి పట్టణంలోని సరవాలి గ్రామంలో గతేడాది అక్టోబరు 28న ఐదేళ్ల చిన్నారి కనిపించకుండాపోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాప కోసం చుట్టుపక్కలంతా గాలించారు. మరుసటి రోజు గ్రామ సమీపంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. బాలిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు బాధితుల బంధువైన కుర్రాడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మైనర్‌పై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 376 (అత్యాచారం), 364 (అపహరణ), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
విచారణ అనంతరం మైనర్‌ను దోషిగా తేల్చారు న్యాయమూర్తి. ఇలా చేయడం దారుణమైన ఘటనగా పరిగణిస్తూ.. జరిమానాతో పాటు సమాజసేవ చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: ప్లాస్టిక్ బాటిళ్లతో సుందరమైన శ్వేత ఏనుగు!