వాల్మీకి రచించిన ఆదికావ్యం రామాయణంపై లోతుగా అధ్యయనం చేసేందుకు అయోధ్యలో రామాయణ పరిశోధన సంస్థను నిర్మించనున్నారు. రామాలయ ప్రాంగణంలోని అమావా మందిర్లో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు అక్కడి మాజీ అధికారి కిశోర్ కునాల్ ఆదివారం వెల్లడించారు.
తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో ఉన్న రామాయణంపై విస్తృత పరిశోధనలు జరపడమే కాకుండా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల్లో అందుబాటులో ఉన్న వెర్షన్లపైనా అధ్యయనం చేసేందుకు ఈ పరిశోధన సంస్థను నిర్మించనున్నారు. ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలను భద్రపరిచేందుకు లైబ్రరీని కూడా ఏర్పాటు చేయనున్నారు.
'రామోవిగ్రాహవన్ న ధర్మ', 'వాల్మీకీ రామాయణ' అనే పేరుతో మొదటి రెండు పుస్తకాలను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నారు.