అయోధ్యలో రామమందిర నిర్మాణం డిసెంబర్ 6లోగా ప్రారంభమవుతుందని భాజపా ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.
'సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే..' అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు సాక్షి మహరాజ్.
"సందేహించాల్సిందేమి లేదు. తీర్పు ఏంటో నాకు తెలుసు, అందుకే నేను డిసెంబర్ 6 నాటికి ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందని చెబుతున్నా."
"వాస్తవాలను సుప్రీంకోర్టుకు పురావస్తుశాఖ నివేదించింది. అయోధ్యలో ఆలయం నిర్మించాలని షియా బోర్డు లిఖితపూర్వకంగా కోరింది. అదే విధంగా సున్నీ బోర్డు కూడా వాదనలు ముగిసే సమయానికి ఆలయ నిర్మాణానికి అనుకూలంగా మాట్లాడింది."- సాక్షి మహరాజ్, భాజపా ఎంపీ
150 ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న ఈ కేసును 40 రోజులు నిరంతరాయంగా విచారించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు సాక్షి మహరాజ్.
ఇదీ చూడండి: వికలాంగులు, వృద్ధుల కోసం పోస్టల్ బ్యాలెట్!