ETV Bharat / bharat

'మోదీ వస్తే రామమందిర నిర్మాణం ప్రారంభిస్తాం'

author img

By

Published : Jul 4, 2020, 7:52 AM IST

అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి జులై 18న రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు భేటీ కానున్నారు. ఆలయ స్తంభాలకు పునాది రాళ్లు వేసే విషయమై ఇందులో చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో ఒకసారి పర్యటిస్తే నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు గోపాల్ దాస్ చెప్పారు.

Ram Mandir Trust
రామమందిర నిర్మాణ ట్రస్ట్

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జులై 18న భేటీ కానుంది. మందిర నిర్మాణానికి సంబంధించి భూమిని చదును చేసిన తర్వాత వివిధ దశలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. అయితే ప్రధాని నరేంద్రమోదీ ఒకసారి ఇక్కడికి వస్తే నిర్మాణం మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ అన్నారు.

ఈ భేటీకి సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్​ తెలిపారు. ఆలయ స్తంభాలకు పునాది రాళ్లు వేసే విషయమై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయమై వాస్తుశిల్పులతో ట్రస్ట్ సభ్యుడు అనిల్​ మిశ్రాతో కలిసి రాయ్​ సమావేశమయ్యారు.

కొనసాగుతున్న పనులు..

రామ మందిర నిర్మాణ్ కార్యశాల వద్ద చెక్కిన రాళ్లను శుభ్రం చేసే పనిలో వీరి బృందం నిమగ్నమైంది. ఈ సమావేశానికి మందిర ప్రధాన వాస్తుశిల్పి ఆశిష్ సోంపురా కూడా హాజరుకానున్నారు. భూమి చదును పనులు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని, వర్షపు జల్లులతో నేల కాస్త తడిసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి: సరిహద్దు ఉద్రిక్తతలతో రామ మందిర నిర్మాణం వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.