రామ మందిర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ సహా సభ్యులంతా.. మోదీని ఆయన నివాసంలో కలిశారు. ట్రస్టు సభ్యులు తొలిసారి సమావేశమైన మరుసటి రోజే మోదీని కలవడం విశేషం.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో మోదీని అయోధ్య సందర్శించాలని కోరారు గోపాల్ దాస్.
అయోధ్య శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్రంలో రామ మందిర నిర్మాణం పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ట్రస్టు ప్రధాన కార్యదర్శి, వీహెచ్‌పీ నేత చంపత్ రాయ్, కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి కూడా మోదీని కలిసిన బృందంలో ఉన్నారు.
ఇదీ చూడండి: దళిత యువకులపై విచక్షణారహితంగా దాడి