ETV Bharat / bharat

క్షీణించిన రామ జన్మభూమి ట్రస్ట్​ అధ్యక్షుడి ఆరోగ్యం - ఆసుపత్రిలో చేరిన నృత్య గోపాల్ దాస్

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్​దాస్​.. ఉత్తరప్రదేశ్​లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. సోమవారం.. గుండె, శ్వాసకోశ సమస్యలు రావడంతో ఆసుపత్రిలో చేరారు.

mahant nritya gopal das
మరింత క్షీణించిన రామ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడి ఆరోగ్యం
author img

By

Published : Nov 9, 2020, 7:41 PM IST

రామ​ జన్మభూమి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో గోపాల్​దాస్​ను ఉత్తరప్రదేశ్​లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చారు.

ఆగస్టు 7న దాస్​కు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. రామ మందిర భూమి పూజా కార్యక్రమానికి హాజరైన రెండు రోజులకే పాజిటివ్​గా తేలింది.

గుండె, శ్వాసకోశ సమస్యలు రావడం వల్ల దాస్​ ఆసుపత్రిలో చేరారని వైద్యులు వెల్లడించారు. అంతకుముందు అయోధ్య జిల్లా కలెక్టర్ డాక్టర్​ అనూజ్ కుమార్.. గోపాల్​దాస్​ను పరామర్శించారు.

"కొవిడ్​ నుంచి కోలుకున్నాక నృత్య గోపాల్ దాస్ ఆశ్రమంలోనే ఉంటున్నారు. కానీ, సోమవారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. రక్తపోటు సమస్య కూడా ఏర్పడింది. దీంతో, ఆయన మేదాంత ఆసుపత్రిలో చేరారు. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ అవుతారు."

-అనూజ్ కుమర్ జా, జిల్లా కలెక్టర్.

ఇదీ చదవండి:అర్ణబ్​ గోస్వామికి హైకోర్టులో చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.